Site icon HashtagU Telugu

Siddhivinayak Temple: సిద్ధివినాయక ప్రసాదంలో ఎలుక‌లు.. వీడియో వైర‌ల్‌..!

Siddhivinayak Temple

Siddhivinayak Temple

Siddhivinayak Temple: తిరుమల ల‌డ్డూ వివాదం తర్వాత ఇప్పుడు ముంబైలోని సిద్ధివినాయకుడి ఆలయ ప్రసాదాల (Siddhivinayak Temple)పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ వీడియో వైరల్ కావడంతో ఆలయంలోని ప్రసాదంలో ఎలుకలు కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. వీడియోలో ప్రసాదాలున్న ఓ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్‌లో ఒక మూలలో ఎలుక పిల్లలు కనిపించాయి. ఈ వీడియో బయటపడిన తర్వాత ప్రసాదం స్వచ్ఛత గురించి ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు సదా సర్వాంకర్ స్పందించారు. వీడియోలో చూపిన స్థలం ఆలయంలో భాగం కాదని ట్రస్ట్ తెలిపింది. మా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. మీడియా సమావేశంలో వైరల్ వీడియోపై ఆలయ ట్రస్ట్ స్పందించింది.

ఆలయం ప్రసాదం కోసం నాణ్యమైన పదార్థాలను దేవ‌స్థానం ఉపయోగిస్తుందని, ఇందులో ప్రీమియం నెయ్యి కూడా ఉంటుందని అధికారి తెలిపారు. నీటి నుండి ముడి పదార్థాల వరకు ప్రతిదీ ల్యాబ్‌లో పరీక్షించబడుతుందన్నారు. ప్ర‌సాదం విష‌యంలో ముగ్గురు ప్రభుత్వ అధికారులు కఠినమైన ప్రమాణాలను అనుసరిస్తున్నార‌ని తెలిపారు.

Also Read: Bajaj E Scooter: పెట్రోల్ లేకుండా చార్జింగ్ లేకుండా నాన్ స్టాప్ గా నడిచే స్కూటర్.. ఎలా అంటే!

సిద్ధివినాయకుని ఆలయంలో రోజుకు 50 వేల లడ్డూలు తయారవుతున్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. పండుగ సమయాల్లో ఈ లడ్డూలకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రసాదంలో 50 గ్రాముల రెండు లడ్డూ ప్యాకెట్లు ఉంటాయి. అంతే కాకుండా లడ్డూలలో వాడే పదార్థాలను కూడా ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ సర్టిఫై చేస్తుంది.

లడ్డూలు 8 రోజులు పాడవవని, ఆలయంలో ఏటా 2 కోట్ల లడ్డూలు తయారవుతాయని ఆలయ ట్రస్టు కార్యదర్శి వీణాపాటిల్‌ తెలిపారు. బ్రాండెడ్ చక్కెరను సిరప్ కోసం ఉపయోగిస్తారు. ల్యాబ్ టెస్ట్ ప్రకారం ఈ లడ్డూలను 7 నుంచి 8 రోజుల వరకు ఉంచవచ్చు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా నాలుగు రోజుల్లోనే వీటిని వినియోగిస్తున్నట్లు ప్యాకెట్‌పై రాస్తున్నామ‌న్నారు. ప్యాకెట్‌లో 50 గ్రాముల రెండు లడ్డూలు ఉన్నాయి. కాంట్రాక్టర్ టెండర్ అంగీకరించే ముందు అతను తయారు చేసిన లడ్డూల నమూనా పరీక్ష జరుగుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం (తిరుపతి ఆలయం)లోని లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా లడ్డూలో గుట్కా ప్యాకెట్ ముక్క‌లు, పొగాకు ప‌లుకులు ఉన్నాయని ఖమ్మంకు చెందిన ఓ మహిళ ఆరోపించిన విష‌యం తెలిసిందే.