Site icon HashtagU Telugu

Karnataka CM: ఢిల్లీకి సిద్దరామయ్య.. డీకే రూటేటో ??

Karnataka

Karnataka Cm

Karnataka CM: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారితో గెలుపొందింది. ఈ పోరులో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఇక జేడీఎస్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ తేల్చలేకపోతుంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు సీఎం రేసులో ఉన్నారు. ఎవరికీ వారు తమ మద్దతు దారులతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మరోవైపు సీఎం ఎవరన్నది పార్టీ హైకమాండ్ తేల్చుతుందంటున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూనే ఎవరికీ వారు సీఎం కుర్చీ కోసం క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు.

కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సీఎంను ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి చాలా సవాల్‌గా మారుతోంది. దీనికి సంబంధించి పార్టీ పరిశీలకులను కూడా నియమించింది, వారు ఈ రోజు ఢిల్లీలో హైకమాండ్‌కు నివేదికను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ రోజు రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నారు. మరోవైపు కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడంపై చర్చ జరుగుతుంది. అయితే ఆయన దానిని ఖండించారు.

ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని డీకే శివకుమార్ తెలిపారు. నేను ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకోలేదని, ఎన్నికల సమయంలో నేను చేయాల్సింది చేశానని, ఇప్పుడు సీఎంను హైకమాండ్ నిర్ణయిస్తుందని శివకుమార్ అన్నారు. ఇదిలా ఉండగా.. కర్నాటక ముఖ్యమంత్రి నిర్ణయంపై కాంగ్రెస్ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు ఎమ్మెల్యేలందరి అభిప్రాయం తీసుకుని నివేదికను సిద్ధం చేశామన్నారు. త్వరలోనే ఈ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందజేస్తామని చెప్పారు.

Read More: MUSLIM DEPUTY CM : ముస్లింనే డిప్యూటీ సీఎం చేయాలి : కర్ణాటక వక్ఫ్ బోర్డు చీఫ్

Exit mobile version