Site icon HashtagU Telugu

Big boss : తండ్రి స్థానంలో తనయ.. బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్?

కమల్ హాసన్ ప్రస్తుత బిగ్ బాస్ తమిళ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. టీవీ హోస్ట్ గా ఇది అతని ఐదో సీజన్. కమల్ హాసన్ ప్రస్తుతం కోవిడ్-19తో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కమల్ ఇప్పుడు బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొనలేకపోవచ్చు. అయితే, అతని కుమార్తె శృతి హాసన్ అతని స్థానాన్ని రిప్లేస్ చేయబోతోంది. కమల్ ప్లేస్ లో ఐదో సీజన్ కోసం బిగ్ బాస్ తమిళ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. సాధారణంగా, వారాంతపు ఎపిసోడ్‌లు ఆదివారం ఉదయం చిత్రీకరించబడతాయి. బిగ్ బాస్ నిర్వాహకులు శృతి హాసన్‌ను తమిళ టీవీ షోకి హోస్ట్‌గా తీసుకోవడానికి ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు కోలివుడ్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో వెంట‌నే చెన్నైలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. క‌మ‌ల్ ఆరోగ్యం ఎలా ఉందో అభిమానులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో కూతురు శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. “నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్.