Site icon HashtagU Telugu

Teenager Gives Birth: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్, ఘటనపై దళిత సంఘాలు ఫైర్!

Teen gives birth

Teen

విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన ఇంటర్ (Class 12) విద్యార్థిని చిన్న వయసులోనే ఓ పిల్లకు జన్మనిచ్చింది. ఈ షాకింగ్ ఘటన చిక్‌ మంగళూరు (Chikmagalur) లో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 12వ తరగతి విద్యార్థి ప్రభుత్వ బాలికల హాస్టల్‌ (Girls Hostel) లో ఉంటూ చదువుకుంటోంది. అయితే విద్యార్థి శిశువుకు జన్మనివ్వడంతో ఈ వార్త చర్చనీయాంశమవుతోంది. దీంతో హాస్టల్ వార్డెన్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

దళిత సంఘర్ష్ సమితి (డిఎస్ఎస్) ఈ ఘటనపై మండిపడ్డాయి. సుమారు 200 మంది బాలికలు నివసిస్తున్న హాస్టల్‌లో ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. విద్యార్థి (teen girl) తన పొత్తికడుపు చుట్టూ బట్టలు చుట్టికోవడంతో గర్భాన్ని గుర్తించలేకపోయారని సాంఘిక సంక్షేమ అధికారి పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ హాస్టళ్లలో (Govt Hostels) బాలికల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్టళ్లకు ఎలా పంపుతారని ప్రశ్నించారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి బాలికల ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేయాలి. అధికారులు ఈ నిబంధన పాటించి ఉంటే ఈ ఘటన చాలా ముందుగానే వెలుగులోకి వచ్చేది. అలా కాకుండా అధికారులు హాస్టల్‌లోనే ప్రసవాలు చేయించారని ఆరోపించారు. సాంఘిక సంక్షేమ అధికారి, హాస్టల్ వార్డెన్- ఇద్దరిపైనా ఎఫ్‌ఐఆర్‌లు (Police Case) నమోదు చేయాలని సంస్థలు డిమాండ్ చేశాయి. వీరిద్దరినీ విధుల నుంచి తొలగించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.