Business Idea: ఈ బిజినెస్ చేస్తే… కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం..!!

  • Written By:
  • Updated On - November 14, 2022 / 09:09 PM IST

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు గొర్రెలను పెంచుతున్నారు. ఈ గొర్రెల ఉన్ని ఉన్ని, తోలు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటి పాలను కూడా మార్కెట్‌లో మంచి ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది.

ఆవు, గేదె, మేకలతో పోలిస్తే గొర్రెల పెంపకం చాలా సులభం. గొర్రెలు ఎక్కువగా పచ్చి గడ్డి, ఆకులను తింటాయి. వాటి మేత ఏర్పాటుకు అంత ఖర్చు లేదు. ప్రస్తుతం దేశంలో మల్పురా, జైసల్మేరీ, మండియన్, మార్వారీ, బికనేరి, మారినో, కొరిదయాల్ రంబుటు, ఛోటా నాగపురి షహబాబాద్ జాతుల గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి.

నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇది కాకుండా, గొర్రెల పెంపకం కోసం రైతులను ప్రోత్సహించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి స్థాయిలలో గ్రాంట్లు ఇస్తాయి.

కేవలం లక్ష రూపాయలతో రైతులు గొర్రెల పెంపకం చేపట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒక గొర్రెను మూడు నుంచి ఎనిమిది వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, రైతు తక్కువ ఖర్చుతో గొర్రెల పెంపకం ద్వారా ఎక్కువ లాభం పొందగలం. గొర్రె మాంసానికి మంచి డిమాండ్ ఉంది. మటన్ షాపుల్లో మేక మాంసం కన్నా, కూడా గొర్రె మాంసానికే మంచి డిమాండ్ ఉంటుంది. దసరా, బోనాలు, బక్రీద్ పండగల వేళ గొర్రెలకు మంచి డిమాండ్ ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గొర్రెల పెంపకం ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తారు. దీని ఉన్ని, మాంసం, పాలు విక్రయించడం ద్వారా మార్కెట్లో మంచి లాభం పొందవచ్చు. ఇది కాకుండా, గొర్రె విసర్జనాలు కూడా చాలా మంచి ఎరువుగా వాడుతుంటారు. దీని ఉపయోగించి పొలాల్లో సహజ ఎరువులుగా వాడవచ్చు. గొర్రె శరీరంపై ఉండే ఉన్నికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో స్వెటర్లు, మఫ్లర్లు, గొంగళ్లు తయారు చేస్తారు.