Site icon HashtagU Telugu

Sharmila Plan : `DK` మార్క్ పాలిట్రిక్స్ ! ష‌ర్మిల‌తో కాంగ్రెస్ జోడీ?

Sharmila Plan

Sharmila Plan

బెంగుళూరు కేంద్రంగా వైఎస్ ష‌ర్మిల చ‌క్రం(Sharmila plan) తిప్పుతున్నారు. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం శివ‌కుమార్ (DK Sivakumar)తో సోమ‌వారం ఆమె భేటీ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం న్యూస్ ఇటీవ‌ల వైర‌ల్ అయింది. ఆ న్యూస్ ను ష‌ర్మిల ఖండించారు. ప్ర‌త్యామ్నాయంగా పొత్తు దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్ గా ఆమె పావులు క‌దుపుతున్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను చేప‌ట్టేలా శివ‌కుమార్ ద్వారా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని టాక్‌.

బెంగుళూరు కేంద్రంగా వైఎస్ ష‌ర్మిల చ‌క్రం(Sharmila plan)

ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌ని ఫోక‌స్ అవుతోంది. కానీ, రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్లు వైఎస్ఆర్టీపీ ద్వారా చీలిపోయే ప్ర‌మాదం ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల(Sharmila Plan) రాజ‌న్న‌రాజ్యం నినాదం వినిపించారు. స్వ‌ర్గీయ వైఎస్ఆర్ (YSR) చ‌రిష్మాను పంచుకోవ‌డానికి ఈ రెండు పార్టీలు పోటీప‌డే ఛాన్స్ ఉంది. అందుకే,పొత్తు పెట్టుకుంటే వైఎస్ అభిమానులు కాంగ్రెస్ ప‌క్షాన నిలిచే అవ‌కాశం లేక‌పోలేదు. లేదంటే, ఓట్ల చీలిపోవ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోనుంది. అందుకే, క‌లిసి ప‌నిచేద్దామంటూ ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిల పిలుపునిచ్చారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం సున్నితంగా త‌ప్పుకున్నారు. ఇప్పుడు ఆయ‌న్ను కాద‌ని కాంగ్రెస్ పెద్ద‌ల‌తో ష‌ర్మిల చ‌క్రం తిప్పుతున్నారు.

స్వ‌ర్గీయ వైఎస్ఆర్  చ‌రిష్మాను పంచుకోవ‌డానికి

ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లేదు. ఉనికిని ఎప్పుడో కోల్పోయింది. దాన్ని బ‌తికించుకోవాలంటే చ‌రిష్మా ఉన్న లీడ‌ర్ ఆ పార్టీకి కావాలి. గ‌త తొమ్మిదేళ్లుగా ఎన్ని ప్ర‌యోగాలు చేసిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ బ‌త‌క‌లేదు. మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఉనికిలోకి తీసుకురాలేక‌పోయారు. అందుకే, ఇప్పుడు ష‌ర్మిల(Sharmila plan) మీద కాంగ్రెస్ పార్టీ ఆశ‌లు పెట్టుకుంది. పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను ఏపీలోనూ ష‌ర్మిల‌కు అప్ప‌గించాల‌ని యోచిస్తుంది. ఆ దిశ‌గా బెంగుళూరు కేంద్రంగా ఆమె లైజ‌నింగ్ మొద‌లు పెట్టారు. త్వ‌ర‌లోనే ఒక రూపానికి ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు వ‌చ్చే ఛాన్స్ ఉంది.

స్వ‌ర్గీయ వైఎస్ కు అత్యంత ఆప్తుడు జ‌గన్మోహ‌న్ రెడ్డి ఆస్తుల‌ను

క‌ర్ణాక‌ట డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ (DK Sivakumar)పూర్వం నుంచి వైఎస్ కుటుంబానికి స‌న్నిహితుడు. పైగా స్వ‌ర్గీయ వైఎస్ కు అత్యంత ఆప్తుడు. అందుకే, జ‌గన్మోహ‌న్ రెడ్డి ఆస్తుల‌ను స‌మాంత‌రంగా హైద‌రాబాద్ తో పాటు బెంగుళూరులోనూ పెంచారు. అక్క‌డ ఉంటూ వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగించారు. అప్ప‌ట్లో డీకే అండ‌దండ‌లు పుష్క‌లంగా వైఎస్ కుటుంబానికి ఉండేవి. రాజ‌కీయంగా ఢిల్లీ లాబీయింగ్ ను ఉప‌యోగించ‌డం ద్వారా డీకే శివ‌కుమార్ కు అప్ప‌ట్లో వైఎస్ పుష్క‌లంగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించారు. ఇదంతా వ్య‌క్తిగ‌త స‌హాయ‌కునిగా ఉన్న సూర్యుడుకు(Suryudu) తెలుసు. అందుకే, రేవంత్ రెడ్డి ఆయ‌న ద్వారా డీకే శివకుమార్ కు దగ్గ‌ర‌య్యార‌ని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ప‌ద‌విని పొంద‌డానికి రేవంత్ కు పూర్తి స్థాయి స‌హ‌కారం శివ‌కుమార్ అందించార‌ని టాక్‌.

Also Read : Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం

క‌ర్ణాట‌క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సంతోషించిన లీడ‌ర్ల‌లో ష‌ర్మిల (Sharmila plan) ప్ర‌ధ‌ములు. ఆమె ప్ర‌త్యేకించి డీకే శివ‌కుమార్ కు అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న సీఎం కావాల‌ని కూడా ఆకాంక్షించారు. స్వ‌ర్గీయ వైఎస్ త‌ర‌హాలో కాంగ్రెస్ పార్టీ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని కితాబు ఇచ్చారు. ప‌లు రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య డిప్యూటీ సీఎం ప‌ద‌వికి ప‌రిమిత‌మైన డీకే శివ‌కుమార్ ను అభినందించ‌డానికి సోమ‌వారం ష‌ర్మిల బెంగుళూరు వెళ్లారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ పొత్తుల అంశం సీరియ‌స్ గా చ‌ర్చ‌కు రానుందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మొత్తం మీద ష‌ర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!