Site icon HashtagU Telugu

Sexual Assault : క‌ర్ణాట‌క‌లో హెడ్ మాస్ట‌ర్ కీచ‌క ప‌ర్వం

Sexual Abuse

Sexual Abuse

కర్ణాటక పాఠశాలలో ఓ హెడ్ మాస్ట‌ర్ వికృతక్రీడ బ‌ట్ట‌బ‌య‌లైంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్‌డికోటే పట్టణంలో విద్యార్థినిని ముద్దుపెట్టుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై విద్యాశాఖ బాలల లైం గిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. స్కూల్‌లోని తన ఛాంబర్‌లో బాలికను హెడ్‌మాస్టర్ ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజల ఆగ్రహానికి దారితీసింది. వీడియో వైరల్ కావడంతో, నిందితుడుగా ఉన్న‌ ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ వీడియోను విద్యార్థులు కిటికీలోంచి చిత్రీకరించారు. ఫిర్యాదుల ఆధారంగా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) పాఠశాల బాలికపై ప్రధానోపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఫిర్యాదును నమోదు చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు

Exit mobile version