Site icon HashtagU Telugu

ఆ ఇంటికి సెక్యూరిటీ పాము..వీడియో వైరల్

R0 0 5520 4140 W1200 H678 Fmax

R0 0 5520 4140 W1200 H678 Fmax

పామంటే చాలా మందికి భయం. అయితే భయపడనివారు కొంత మంది మాత్రమే ఉంటారు. పాము కనబడితే చాలు కొంతమందికి చేతులు కాళ్లు అదురుతాయి. అలాంటి పాము ఓ ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లోనివారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి పామును బయటకు పంపేందుకు నానా కష్టాలు పడాలి. ఆ పామును ఇంటి నుంచి బయటకు పంపేందుకు నిద్ర కూడా పట్టదు.

తాజాగా ఓ వ్యక్తి ఇంట్లోకి పెద్ద నాగుపాము దూరి అక్కడే సెటిల్ అయ్యింది. ఆ ఇంట్లోకి పాము దూరటమే కాకుండా తలుపు దగ్గర ఉన్న రంధ్రంలోకి చేరి పడగతో అందర్నీ భయపెట్టింది. ఇంట్లోని వారు బయటకు వెళ్లాలన్నా, బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి రావాలన్నా ఆ పామును దాటుకునే రావాల్సిన పరిస్థితి వచ్చింది.

పాము ఎవ్వరినీ అటువైపు రానివ్వకుండా బుసలు కొడుతూ భయపెడుతోంది. పాము అలా చేయడంతో ఇంట్లోని వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఆ పాముకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. వీడియోకు వేలల్లో వ్యూస్‌, లైక్స్‌ వస్తున్నాయి.

వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంటికి హై సెక్యూరిటీగా పాము ఉందంటూ కొందరు అంటుంటే, తలుపు దగ్గర ఇంత బందోబస్తు ఎప్పుడూ చూడలేదని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు. మొరిగే కుక్క కన్నా ఈ పాము సెక్యూరిటీ చాలా మేలని ఒకరు అంటే ఇంతకీ ఈ పామును ఏం చేశారని మరో నెటిజన్ అడిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.