షెడ్యుల్డ్ కులాల ఉప వర్గీకరణను(SC sub Reservation) నిరసిస్తూ కర్ణాటకలో(Karnataka) బంజారాలు మాజీ సీఎం యడ్యూరప్ప ఇంటిని చుట్టుముట్టారు. పెద్ద సంఖ్యలో బంజారా సామాజికవర్గం ఆయన ఇంటి మీద రాళ్లు రువ్వారు. వందలాది మంది యడ్డీ ఇంటి వెలుపల భారీ ప్రదర్శన చేశారు. ఆ సందర్భంగా రాళ్ల దాడి జరిగిందని తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
వందలాది మంది యడ్డీ ఇంటి వెలుపల భారీ ప్రదర్శన (SC sub Reservation)
Also Read : Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలను తీసుకుంది. దానికి నిరసనగా కర్ణాటక బంజారా సంఘం నిరసనలు తెలుపుతోంది. విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను మార్పు చేయడాన్ని నిరసిస్తోంది. బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రకారం ఎస్సీ వర్గాలకు ఉన్న 17 శాతం రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేస్తూ కేటాయించారు. వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలకు 6శాతం, ఉన్నతంగా ఉన్న షెడ్యూల్డ్ కులాలకు 5.5శాతం, అస్పృశ్యులకు 4.5 శాతం , ఇతరులకు ఒక శాతం వారికి కేటాయిస్తూ వర్గీకరణ చేస్తూ బిల్లును కేంద్రానికి పంపింది.
బంజారా సామాజికవర్గం నిరసనల
రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఆవశ్యకతను 2005లో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) పరిశీలించింది. అందుకోసం వేసిన ఏజే సదాశివ కమిషన్ నివేదిక ఆధారంగా బొమై ప్రభుత్వం సిఫారస్సు చేసింది. దాని కారణంగా నష్టపోతున్నామని బంజారా సామాజికవర్గం భావిస్తోంది. అందుకే, నిరసనలకు దిగుతోంది. మాజీ సీఎం యడ్యూరప్ప ఇంటి ఎదుట భారీ ప్రదర్శనకు దిగడం బీజేపీకి సవాల్ గా మారింది.
Also Read : Karnataka Election :డీకే, సిద్ధితో కర్ణాటక కాంగ్రెస్ తొలి జాబితా!