శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందా? జయలలితకు ‘ఇష్టసఖి’గా పేరున్న శశికళ తమిళనాడులో చక్రం తిప్పాలని భావిస్తుందా? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. అవుననే చెప్పక తప్పదేమో..!

  • Written By:
  • Publish Date - October 16, 2021 / 01:03 PM IST

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందా? జయలలితకు ‘ఇష్టసఖి’గా పేరున్న శశికళ తమిళనాడులో చక్రం తిప్పాలని భావిస్తుందా? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. అవుననే చెప్పక తప్పదేమో..! అన్నాడీఎంకే స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంలో స్వర్ణోత్సవాల వేళ శశికళ తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ప్రజా జీవితానికి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన శశికళ ఇవాళ మెరీనా బీచ్ లో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై సమాధులను సందర్శించి పూలమాలలు వేయనున్నారు. అయితే శశికళ మెరీనా బీచ్ ను సందర్శించడానికి వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని పలువురు కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో వీకే శశికళ మాట్లాడుతూ జయలలిత బతుకున్నప్పుడు కూడా నేనప్పుడూ అధికారం కోసం పాకులాడలేదని, పార్టీ కార్యక్రమాలకనుగుణంగా నడుచుకున్నానని స్పష్టం చేశారు. కానీ శశికళ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. డీఎంకే గెలుపు కోసం శశికళ ప్రయత్నించిందనే వార్తలు సైతం వినిపించాయి. ఇదే సమయంలో శశికళ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై అన్నాడీఎంకే మాజీ నాయకుడు ఘాటుగా స్పందించారు. ఆమెకు అన్నాడీఎంకే లో చోటులేదని కరాఖండిగా చెప్పేశారు.

2016 డిసెంబర్ లో జయలలిత మరణం తర్వాత, పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు శశికళ. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేందుకు పావులు కదిపారు. అయితే ఆదాయానికి మించి ఆక్రమ ఆస్తులున్నాయని ఆరోపణల నేపథ్యంలో శశికళ జైలు పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పళినస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.