Site icon HashtagU Telugu

Sasikala:కొడనాడు ఎస్టేట్ కేసులో.. శశికళ టూ అన్నాడీఎంకే.. ఆ 1000 మంది ఏం చెప్పారు?

Sasikala Kodanan

Sasikala Kodanan

కొడనాడు ఎస్టేట్ అంటే తమిళనాడులో చాలా ఫేమస్. ఎందుకంటే అది మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది. కానీ జయ మరణం తరువాత అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2017లో ఆ ఎస్టేట్ వాచ్ మెన్ హత్య జరిగింది. తరువాత దోపిడీ జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై శశికళను రెండు రోజులపాటు ప్రత్యేక పోలీస్ బృందం విచారించింది. ఇందులో ఆమె ఏం చెప్పారు? అన్నాడీఎంకేలోని కొంతమంది కీలక నేతలను నీలగిరి స్పెషల్ పోలీస్ టీమ్ ఎందుకు విచారించాలనుకుంటోంది?

జయలలిత మృతి తరువాత కొడనాడు ఎస్టేట్ ఎవరి ఆధీనంలో ఉండేదన్న ప్రశ్నకు శశికళ ఇచ్చిన సమాధానం కీలకంగా మారిందా? కంప్యూటర్ ఆపరేటర్ సూసైడ్ గురించి కూడా శశికళను ప్రశ్నించారు. కానీ ఆమె మాత్రం సింపుల్ గా ఒకటే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన సమయంలో తాను బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్నానన్నారు. జైలులో ఉన్న తనకు బయట ఏం జరిగిందో తెలియదన్నారు. కేవలం పార్టీ నేతల ద్వారా మాత్రమే విషయం తెలిసిందన్నారు. ఈ హత్యలు, దోపిడీ వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. దీంతో పోలీసులు ఆమె నుంచి కీలకమైన స్టేట్ మెంట్ ను తీసుకున్నారు.

కొడనాడు కేసుకు సంబంధించి నీలగిరి ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే దాదాపు 1000 మందిని విచారించింది. ఇప్పుడు శశికళ చెప్పిన వివరాల ఆధారంగా అన్నాడీఎంకేలో కొంతమంది నేతలను విచారించడానికి రంగం సిద్ధం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ కేసుపై స్పెషల్ గా ఫోకస్ పెట్టడంతో త్వరలోనే అసలు నిజాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయంటున్నాయి డీఎంకే వర్గాలు.