Palakkad Accident:స్కూల్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు..9మంది విద్యార్థులు మృతి..!!

కేరళలోని పాలక్కాడ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సును ఢీ కొన్న ఘటనలో 9మంది విద్యార్థులు మరణించారు.

  • Written By:
  • Updated On - October 6, 2022 / 01:25 PM IST

కేరళలోని పాలక్కాడ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సును ఢీ కొన్న ఘటనలో 9మంది విద్యార్థులు మరణించారు. 35మందికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం రాత్రి పాలక్కాడ్ లోని వడకెంచెరి ప్రాంతంలో కేరళ గవర్నమెంట్ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ బస్సు కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా..ఆర్టీసీ బస్సు వెనక నుంచి అతివేగంగా ఢీకొట్టిందని ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు తెలిపారు.

ఈ ప్రమాదంలో రెండు బస్సులు అదుపు తప్పి బోల్తాపడ్డాయి. బస్సులోని ఐదుగురు విద్యార్థులు అక్కడిక్కడే మరణించారు. ఇందులో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ బస్సు అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేరళలోని కొట్టారక్కర నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సు వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులో 81 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ముగ్గురు మృతి చెందారు.