Vijay Devarakonda: అవయవ దానం పై రౌడీ హీరో సంచలన నిర్ణయం..!!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అయినా ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఓ వైపు ప్లాపులు.. మరో వైపు బాలీవుడ్ లో అవకాశాలు రావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిందే. దీంతో రౌడీ బాయ్ కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. తన కష్టమంతా వ్రుదా అయ్యింది. ప్రస్తుతం ఖుసి […]

Published By: HashtagU Telugu Desk
Vijay Devarakonda

Vijay Devarakonda

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అయినా ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఓ వైపు ప్లాపులు.. మరో వైపు బాలీవుడ్ లో అవకాశాలు రావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిందే. దీంతో రౌడీ బాయ్ కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. తన కష్టమంతా వ్రుదా అయ్యింది. ప్రస్తుతం ఖుసి మూవీ చేస్తున్నారు. అది షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది.

ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ దక్షిణభారతదేశంలో అవయవ దానం చేసేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారని…దీనిపై మరింత అవగాహన అవసరముందన్నారు. తాను అవయవ దానం చేస్తున్నానని చెప్పిన ఈ హీరో…తన తల్లి కూడా అవయవ దానం చేస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ దేవరకొండ ప్రకటనతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రియల్ లైఫ్ హీరో అంటూ పొగుడుతున్నారు. మీ హార్ట్ చాలా గొప్పది సర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు నిజంగా మా ప్రేరణ… మీరంటే మాకు గౌరవం పెరిగిందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

  Last Updated: 18 Nov 2022, 11:34 AM IST