Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి ఆదాయం వెల్లువ

Sabarimala : కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యం గ‌డిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది.

  • Written By:
  • Updated On - December 26, 2023 / 03:20 PM IST

Sabarimala : కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యం గ‌డిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇప్ప‌టివ‌ర‌కు భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల ద్వారా  రూ.63.89 కోట్లు, అర‌వ‌న ప్ర‌సాదం అమ్మ‌కాలతో రూ.96.32 కోట్లు, అప్పం ప్ర‌సాదం అమ్మకాలతో రూ.12.38 కోట్లు వచ్చాయి. ఈవివరాలను ట్రావ‌న్‌కోర్ దేవ‌స్థానం బోర్డు అధ్య‌క్షుడు పీఎస్ ప్ర‌శాంత్ వెల్లడించారు. మండ‌ల పూజ స‌మ‌యంలో డిసెంబ‌ర్ 25 నాటికి దాదాపు 31.43 లక్షల మంది భ‌క్తులు అయ్య‌ప్ప స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ టైంలో 7.25 లక్షల మందికి ఉచిత భోజ‌నం పెట్టారు. రెండు నెల‌ల మండ‌ల పూజ దీక్షాకాలం రేపు(డిసెంబ‌ర్ 27న) ముగియ‌నుంది. బుధ‌వారం రాత్రి 11  గంటలకు ఆల‌యాన్ని మూసివేయ‌నున్నారు. మ‌క‌ర‌విల‌క్కు పండుగ కోసం మ‌ళ్లీ డిసెంబ‌ర్ 30న ఆల‌యాన్ని(Sabarimala) తెర‌వ‌నున్నారు. జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు ఆల‌యాన్ని తెరిచి ఉంచుతారు.

We’re now on WhatsApp. Click to Join.

శబరిమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పలుచోట్ల భక్తులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మరికొందరు భక్తులు రద్దీని తట్టుకోలేక అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోతున్నారు. ఈ ఘటనలపై తాజాగా కేరళ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. భక్తుల కోసం మార్గం మధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల (ఎడతవలం) వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించింది. భక్తులకు మంచి నీరు, అల్పాహారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది.

Also Read: Driving In River : నదిలో జీపు డ్రైవింగ్.. ఎందుకిలా చేశారంటే ?