Stalin : కులాంత‌ర వివాహాల‌కు `స్టాలిన్` ప్ర‌భుత్వ ఉద్యోగం

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యానికి తెర‌లేపాడు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా కులాంత‌ర వివాహాలు చేసుకున్న వాళ్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని భావించాడు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 01:45 PM IST

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యానికి తెర‌లేపాడు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా కులాంత‌ర వివాహాలు చేసుకున్న వాళ్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని భావించాడు. ఆ మేర‌కు సూత్ర‌ప్రాయంగా వెల్ల‌డించిన స్టాలిన్ అధికార‌కంగా ఉత్త‌ర్వుల‌ను వెలువ‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌ల బ్రాహ్మ‌ణేత‌ర కులాల వారిని అర్చ‌కులుగా నియ‌మించాడు. ఇప్పుడు సామాజికంగా అంశంగా కులాంత‌ర వివాహాల‌ను తీసుకున్నాడు. కోవిడ్ ను అదుపు చేయ‌డానికి ఆయ‌న తీసుక‌న్న నిర్ణ‌యాలు దేశ వ్యాప్తంగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందాయి. ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకెళ్లి ప‌నిచేయించాడు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆయ‌న చేసిన తొలి కీల‌క నిర్ణ‌యం అది. ఆ త‌రువాత కోవిడ్ బాధితుల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డం, మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు పింఛ‌న్లు, విడాకులు అధికారికంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ రేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం, అసెంబ్లీ క్యాంటిన్ల‌ను  తొలగించ‌డం..ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవ‌ల స్టాలిన్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు అనేకం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి.

Also Read : భర్త, కుటుంబం వదిలేసినా.. కష్టపడి పోలీస్ అయిన ఓ అమ్మ

ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కులాంత‌ర వివాహాల‌కు ప్రేమ వివాహాలు కేంద్రంగా మారాయి. ఫ‌లితంగా కుటుంబీకుల‌కు, బంధువుల‌కు కొంద‌రు దూరం అవుతున్నారు. నిరాద‌ర‌ణ‌కు గురైన అలాంటి జంట‌ల‌ను అక్కున చేర్చుకోవాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఎలాంటి ఆద‌ర‌వు లేకుండా ఉండే వాళ్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించ‌డానికి స్టాలిన్ సిద్దం అవుతున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న వారికి జీవనభృతి కల్పించడం కొరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. బ్రాహ్మ‌ణేత‌రుల‌ను అర్చ‌కులుగా నియ‌మించ‌డం, కులాంత‌ర వివాహాలు చేసుకున్న వాళ్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చే నిర్ణ‌యం సామాజిక మార్పును తీసుకొస్తుంద‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు. రాజ‌కీయ, సామాజిక‌, ఆర్థిక మార్పుల కోసం స్టాలిన్ తీసుకుంటోన్న నిర్ణ‌యాలు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డ‌మే కాకుండా ఔరా..అనిపించేలా పాల‌న సాగిస్తున్నాడు స్టాలిన్‌.