Red Ants : ఒడిశా వాసులపై దండ యాత్ర చేస్తున్న ఎర్ర చీమలు

చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే.. నా బంగారు పట్టలో వేలు పెట్టావంటే నేను ఎందుకు కుట్టను అని మన పెద్దలు

  • Written By:
  • Updated On - September 6, 2022 / 10:58 AM IST

చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే.. నా బంగారు పట్టలో వేలు పెట్టావంటే నేను ఎందుకు కుట్టను అని మన పెద్దలు చిన్నతనంలో చెప్పినట్లు.. అచ్చం అలాంటి సీన్ ఒడిశాలో రిపీట్ అయ్యింది. చీమలు దెబ్బకు ఏకంగా ఊరు ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్లి పోయాయి. అవును మీరు చదివింది నిజమే. ఆ చీమల దండుకు గ్రామం మొత్తం వామ్మో మేము ఇక కుట్టించుకోలేము అంటూ పారిపోతున్నారు. అసలు చీమలు నిజంగానే దండయాత్ర చేస్తాయా అంటే ఏమో అని టక్కున సమాధానం చెబుతాం. కానీ ఈ స్టోరీ చూస్తే మీక్కూడ కొంచం ఆశ్చర్యంగానే అనిపించోచ్చు.

చీమల బాబోయ్..ఎర్ర చీమలు

చీమలు బాబోయ్‌ చీమలు. భరించ లేకపోతున్నాం. ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందే. మునుపెన్నడూ ఇలాంటి చీమల దండుని చూడనే లేదు’ ఇదీ.. పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్‌ పంచాయతీ బ్రాహ్మణ సాహి గ్రామస్తుల నోటి వెంట నుంచి వస్తున్న మాటలు. ఆ గ్రామంలో చీమలు దండెత్తుతున్నాయి. అక్కడున్న వారిని ఘాటుగా కుడుతున్నాయి. గత రెండు నెలలుగా చీమల వేధింపులు భరించలేదక గ్రామస్తులు మూటాముల్లె సర్దకొని వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

మొదట్లో లైట్ తీసుకున్నారు.. ఇప్పుడు అయ్యా, అమ్మో అంటున్నారు

చీమలు మొదట ఇళ్లలోకి వచ్చినప్పుడు గ్రామస్థులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. అలాగే మనుషులపై ఎక్కువగా దాడి చేస్తుండడం వల్ల భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రచీమల బెడద భరించలేక కొందరు గ్రామస్థులు ఇప్పటికే వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. చీమల నివారణకు క్రిమిసంహారక మందులు వాడినప్పటికీ ప్రయోజం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక ఇళ్లలోని మట్టిగొడల్లో అవి తిష్టవేశాయి. రెండు నెలలుగా చీమలు గ్రామస్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.

తమిళనాడులో ఇదే పరిస్థితి…

తమిళనాడులోని అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలపై సైతం ఇటీవల చీమల దండు వీరవిహారం చేసింది. ‘ఎల్లో క్రేజీ యాంట్స్‌’ అని పిలిచే ఆ చీమలు దిండుక్కల్‌ జిల్లా కరంతమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిసరాల్లోని సుమారు ఏడు గ్రామాలపై దండయాత్ర చేశాయి. పంటపొలాల్ని నాశనం చేస్తుండడం, రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లనూ స్వాహా చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం కొందరు నిపుణులను పిలిపించి.. వాటి నివారణకు చర్యలు చేపట్టడం మొదలు పెట్టింది. మొత్తానికి తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలను ఎర్ర చీమలు భయపెడుతున్నాయి.