Site icon HashtagU Telugu

RCP Singh: బీజేపీలో చేరిన జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్

Rcp Singh

Rcp Singh

RCP Singh: కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన బీజేపీ అధికారిక సభ్యత్వం తీసుకున్నారు. దాదాపు ఏడాది కాలంగా మాజీ కేంద్ర మంత్రి ఆర్‌సిపి సింగ్ బిజెపిలోకి వెళ్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో  హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొన్నారు.

ఆర్‌సీపీ సింగ్ ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో దాదాపు ఏడాది పాటు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నితీష్ కుమార్, జేడీయూతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆర్‌సిపి సింగ్ బిజెపితో కలిసి జెడియును దెబ్బతీయడానికి ప్రయత్నించారని గత ఏడాది నుంచి ఆరోపణలు వచ్చాయి. తనపై పలు ఆరోపణలు రావడంతో జేడీయూకు రాజీనామా చేశారు.

రెండు రోజుల క్రితం జెడియుకి రాజీనామా చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి సుహేలీ మెహతాతో పాటు, ఇంకా చాలా మంది జెడియు నాయకులను బిజెపిలో చేర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు.

Read More: Mudragada : జ‌న‌సేన‌కు చెక్ పెట్టేలా ముద్ర‌గ‌డ?