Site icon HashtagU Telugu

Rats Eat Cannabis: గంజాయి తిన్న ఎలుకలు.. కేరళ కోర్టు తీర్పులో బిగ్ ట్విస్ట్!

Rats

Rats

ఎలుకలే (Rats) కదా చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఆ చిట్టి ఎలుకలు ఏదైనా చేస్తాయి. బీరువాలో భద్రంగా దాచుకున్న డాక్యుమెంట్లను కొరికేయగలవు. కోర్టు లో ఉన్న సాక్ష్యాధారాలను కూడా మాయం చేసేయగలవు. అవును ఇది నమ్మడానికి వింతగా ఉన్నా.. కానీ జరిగిన విషయం తెలుసుకుంటే అవాక్కు అవుతారు.  డిసెంబర్ 2016లో కేరళ (Kerala) రాజధానిలో ఓ వ్యక్తిని గంజాయి (Cannabis)ని విక్రయిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గంజాయితో పట్టుబడిన నిందితుడు సాబును తిరువనంతపురం కంటోన్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సాబు వద్ద 125 గ్రాముల (Cannabis) గంజాయి దొరికింది. ఇందులో 100 గ్రాములను శాస్త్రీయ పరీక్షకు పంపగా, 25 గ్రాములను తిరువనంతపురం మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కోర్టు గదిలో సాక్ష్యంగా ఉంచారు.

విచారణ ప్రారంభం కాగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ప్రక్రియలో భాగంగా కోర్టు హాలులో ఉంచిన సాక్ష్యాధారాలను పరిశీలించగా.. సగం సాక్ష్యాధారాలు మాయమైనట్లు తేలిందని, ఇది ఎలా జరిగిందని ఆరా తీస్తే ఎలుకలు (Rats) గంజాయిని తిని ఉండొచ్చని ప్రాసిక్యూషన్‌ తెలిపింది. ఈ సాక్ష్యపైనే కోర్టు తీర్పు ఆధారపడినది. అయితే ఇప్పుడు ఎలుకలు నిందితుడు సాబును శిక్ష నుంచి తప్పించనున్నాయా? అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలుకలు గంజాయి (Cannabis) తిన్నాయనే వార్త ప్రస్తుతం కేరళలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Mirzapur Actor Died: మిర్జాపూర్ నటుడు షానవాజ్ మృతి

Exit mobile version