Ramya : పీసీసీ చీఫ్ హీరోయిన్ హాట్ కామెంట్స్…!!!

కొంతమంది సెలబ్రిటీలు...హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. మరికొంతమంది రాజకీయాల్లోకి వచ్చిన సొంత పార్టీ నేతలపైన్నే వ్యాఖ్యలు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 11:57 AM IST

కొంతమంది సెలబ్రిటీలు…హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. మరికొంతమంది రాజకీయాల్లోకి వచ్చిన సొంత పార్టీ నేతలపైన్నే వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా కర్నాటకలో పీసీసీ చీఫ్ డీకె శివకుమార్ పై నటి రమ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రమ్య చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. డికే శివకుమార్ పై ఆరోపణలు చేసిన రమ్మ…కాంగ్రెస్ లో ఉన్నారో లేదో తెలియదని ఆ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహ్మద్ నలపాడ్ అన్నారు. ఆమెకు తమ పార్టీలో ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదన్నారు. ఏ సమస్యలున్నా మాట్లాడాలి తప్పా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నలపాడ్ మాటలపై స్పందించారు రమ్య. బెయిల్ పై ఉన్న వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్ చేశారు రమ్య.

కన్నడి నటి, రాజకీయనాయకురాలు..రమ్య కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్, పార్టీ ప్రచార కమిటీ చీఫ్ ఎంబి పాటిల్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంలో తాను చేరారు. పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ రిక్రూట్ మెంట్ స్కామ్ ను కప్పిపుచ్చుకోవడానికే ఉన్నత విద్యాశాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్ తో రహస్య సమావేశం నిర్వహించారని పాటిల్ పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఆరోపణలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీటిపై స్పందించిన రమ్య….శివకుమార్ పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఒకరినొకరు కలుస్తారని…పార్టీలకు వెళ్తారని..కొందరు కుటుంబాల్లో పెళ్లి చేసుకుంటారు…నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. @DKశివకుమార్ కాంగ్రెస్ వాది అయినా @MBPatilగురించి అనడం..ఎన్నికల్లో పార్టీ కలిసి పోరాటం చేస్తుందా అని రమ్య ట్వీట్ చేశారు.

రమ్య ట్వీట్ ను కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ట్వీట్ ను అనుసరించి…పార్టీ రాజకీయంగా ఎదగడానికి సహకరించిన వ్యక్తని రమ్యమరిచిపోయారంటూ కాంగ్రెస్ ట్రోల్స్ దాడి చేయడం ప్రారంభించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. తనకు అవశాలు ఇచ్చి నాకు అండగా నిలిచిన ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమే అని చెప్పుకొచ్చారు.