Site icon HashtagU Telugu

PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక  వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనా మహోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారందరినీ దేశం ఈ ఎన్నికల్లో తిరస్కరించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చివరి నిమిషం దాకా అన్ని రకాల ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్య రామమందిరం నిర్మాణంపై నిర్ణయం తీసుకొని ఉండేదని వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join

బాంబు పేలితే.. గ్యాస్ సిలిండర్ పేలిందన్నారు

‘‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారతదేశ ఐటీ హబ్‌ బెంగళూరు బాంబులతో దద్దరిల్లింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బాంబు పేలుడుతో బెంగళూరు దద్దరిల్లితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పేలిందని బుకాయించింది. బాంబు పేలలేదు..వాళ్ల మైండు పేలింది.. ఆ పేలుడుకు పాల్పడిన వాళ్లంతా పీఎఫ్ఐ కార్యకర్తలని తేలింది’’ అని ప్రధాని మోడీ(PM Modi) పేర్కొన్నారు. ‘‘కర్ణాటకను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో అసాంఘిక శక్తులు, దేశ వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన సమూహాలకు మద్దతు ఇస్తోంది’’ అని ఆయన ఆరోపించారు.

Also Read : Sunetra vs Supriya : శరద్ పవార్‌కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు

ఉగ్రవాదులు చనిపోతే కన్నీళ్లు పెట్టుకుంటారు

‘‘మేం కర్ణాటకలో అధికారంలో ఉన్న టైంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలను బ్యాన్ చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలాంటి సంస్థలకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లు అయింది. రాహుల్ గాంధీ లోక్‌సభకు పోటీ చేస్తున్న వయనాడ్‌లోనూ పీఎఫ్‌ఐ యాక్టివ్‌‌గా పనిచేస్తోంది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటే.. ప్రభుత్వం నడిపే అవకాశమే దక్కితే దేశ వ్యతిరేక శక్తుల భరతం పట్టడమే పనిగా పెట్టుకుంటుంది. తీవ్రవాదులు చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించి.. కన్నీళ్లు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది’’ అని ప్రధాని మోడీ చెప్పారు.

Also Read :Alejandra Rodríguez: మిస్ యూనివ‌ర్స్‌గా 60 ఏళ్ల భామ‌.. ఎవరీ అలెజాండ్రా రోడ్రిగ్జ్‌..?