కావేరి ఆసుపత్రిలో చేరిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 28న జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

  • Written By:
  • Updated On - October 29, 2021 / 11:23 AM IST

తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 28న జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య, రజనీకాంత్ బావ రవిచంద్రన్ ఆసుపత్రిలో ఉన్నారు.ఈ చెకప్ క్రమం తప్పకుండా చేయాల్సి ఉందని అందుకోసమే ఆసుపత్రిలో చేరారని నటుడు రియాజ్ కె అహ్మద్ తెలిపారు.

రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడానికి రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి వచ్చారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో మాట్లాడారు.రజనీకాంత్ రాబోయే చిత్రం అన్నాత్తే నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిశ్చర్స్ నిర్మించింది. అక్టోబర్ 27న చెన్నైలోని ఓ ప్రవేట్ స్టూడియోలో అన్నాత్తై చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ చిత్రాన్ని నటుడు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి వీక్షించారు.

రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్లో బీపీ పెరగడం వల్ల హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే చిత్రబృందం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. దీంతో రెండు రోజుల్లో ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత తనకు ఆరోగ్యం సహకరించడంలేదంటూ పార్టీ ని స్థాపించడంలేదని ఆయన ప్రకటించారు.ఇది భగవంతుడు నాకు ఇచ్చిన హెచ్చరికగా తాను భావిస్తున్నానని…పార్టీని ప్రారంభించిన తర్వాత మీడియా, సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే రాజకీయాల్లో రాణించలేనని ఆయన తెలిపారు.