Rain Fury: భారీ వరదలతో నెల్లూరుకు సంబంధాలు కట్

భారీగా కురుస్తున్న రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 21, 2021 / 03:56 PM IST

2 లక్షల క్యూసెక్కుల నీరు సోమశిల నుంచి విడుదల అవుతోందని రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు ప్రకటించారుపెన్నా నదికి వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా పలు రాష్ట్రాలకు రవాణా స్తంభించిపోయిందినవంబర్ 21 నుండి ఎడతెరిపి లేకుండా నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి

భారీగా కురుస్తున్న రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో ఈ రాష్ట్రాల్లో సూర్యుడు కూడా కనిపించడం లేదు.

ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాలవల్ల
ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని, మొత్తం 17 మంది గల్లంతైనట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కడపలో 13 మంది, అనంతపురం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో నలుగురు చొప్పున మరణించినట్లు పేర్కొంది. అలాగే 17 మంది గల్లంతయ్యారని, కడప జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 4, అనంతపుం, నెల్లూరు జిల్లాల్లో చెరోకరు చొప్పున గల్లంతైనట్టు వివరించింది. తెలంగాణాలో ఈ అల్పపీడన ప్రభావం తక్కువగానే ఉండి సాధారణ వర్షాలు కురుస్తున్నప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తమినాడులోనూ వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. గతవారం కురిసిన వర్షాలు ఆగాయని అనుకునేలోపే వాతావరణశాఖ అక్కడి తీరప్రాంత జిల్లాలకు మరోసారి రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. దింతో అక్కడి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

కేరళలోనూ భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల పంబా సహా ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరిగింది. పంబా నదిలో వరదలు రావడంతో డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు.
కక్కి-అనథోడే అనాతోడ్ రిజర్వాయరు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పథనంతిట్టా అధికారులు చెప్పారు.

కర్ణాటకలో కూడా వర్షం దుమ్ము లేపుతోంది. రాష్ట్ర రాజధానితోపాటు పలు ప్రాంతాల్లో మరో రెండురోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కర్ణాటకలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.