రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలి!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - October 16, 2021 / 02:25 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌ మనుగడ సాధించడం కష్టమని అన్నారు.

“నెహ్రూ-గాంధీ కుటుంబం మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఐక్యతను కాపాడగలదని, నా అభిప్రాయం ప్రకారం రాజవంశ రాజకీయాలు కొనసాగాలని కాదు, కానీ నెహ్రూ-కుటుంబం పార్టీని నడిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం రాహుల్ గాంధీ లేదా సోనియాగాంధీ లాంటి జనకర్షక నేతలతోనే సాధ్యం. రాహుల్ గాంధీ తప్పనిసరిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలి’’ అని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ మసక బారుతున్న కారణంగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు తప్ప, మరెవరూ పార్టీని నడిపించలేరని అన్నారు. ఈ నెలలో సోనియా గాంధీతో జరిగిన సమావేశంలో, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తాను ఆమోదించానని చెప్పారు. రాహుల్ అధ్యక్షుడిగా ఉండాలని ప్రియాంక గాంధీ సైతం కోరుకుంటున్నారని, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ నాయకులలో ప్రియాంక అత్యంత శక్తివంతమైనది, ఇతర నాయకులు ప్రతిపక్ష నాయకుల పనితీరును విమర్శిస్తుంటే.. ప్రియాంక మాత్రం  ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ పనితీరు ఘోరంగా ఉందని, వచ్చ ఎన్నికలో మోడీ ప్రభుత్వం ఓటమిపాలు కావడం ఖాయమని ఆయన అన్నారు. నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గింది. 2019 లో అతని ప్రజాదరణతో పోలిస్తే, అతని ఇమేజ్ దెబ్బతిందని సిద్ధరామయ్య అన్నారు.