Bharat Jodo Yatra : క‌ర్నాట‌క‌లో `భార‌త్ జోడో` ఫ్లెక్సీ వివాదం

కర్నాట‌క రాష్ట్రంలో భార‌త్ జోడో యాత్ర ఫ్లెక్సీల‌కు సంబంధించిన వివాదం నెల‌కొంది. సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేర‌ళ రాష్ట్రం నుంచి క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లా గుండ్లుపేట వ‌ద్ద ఎంట‌ర్ అవుతారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 05:00 PM IST

కర్నాట‌క రాష్ట్రంలో భార‌త్ జోడో యాత్ర ఫ్లెక్సీల‌కు సంబంధించిన వివాదం నెల‌కొంది. సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేర‌ళ రాష్ట్రం నుంచి క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లా గుండ్లుపేట వ‌ద్ద ఎంట‌ర్ అవుతారు. ఆ సంద‌ర్భంగా రాహుల్ కు స్వాగతం ప‌లుకుతూ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌తో కూడిన ఫ్లెక్సీల‌ను క్యాడ‌ర్ ఏర్పాటు చేశారు. సుమారు 40 ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌గా, వాటిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చించివేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ప్లెక్సీల‌ను చించివేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీనియర్ బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా గతంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లీవ్ కాంగ్రెస్ ప్రాజెక్ట్‌గా మారిందని అన్నారు. ` జోడో యాత్ర కాంగ్రెస్ చోడో యాత్ర (క్విట్ కాంగ్రెస్ యాత్ర)గా మారింది. గులాం నబీ ఆజాద్ జీ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ఆ పార్టీలో ఇప్పుడు భయాందోళనల వాతావరణం నెలకొందని తెలియజేస్తోంది’ అని మిశ్రా తన ట్వీట్ వీడియోలో పేర్కొన్నారు.రాహుల్ గాంధీ చేప‌ట్టిన‌ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కేరళ రాష్ట్రంలో 18 రోజుల పాటు ప్ర‌యాణించి, సెప్టెంబర్ 30న కర్నాటకకు జోడో యాత్ర చేరుకుంటుంది. ఈ యాత్ర‌ 21 రోజుల పాటు కర్ణాటకలో ఉంటుంది. ప్రతిరోజూ 25 కి.మీ. న‌డిచేలా బ్లూ ప్రింట్ ను ఉంచారు.