Site icon HashtagU Telugu

Rahul Gandhi: డెలివరీ బాయ్స్ తో రాహుల్ ముచ్చట్లు

Rahul Gandhi

New Web Story Copy (84)

Rahul Gandhi: మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈరోజుతో ప్రచారానికి తెరపడనుంది. ఈరోజు చివరి సారిగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తుంది. చివరి ప్రచారం కావడంతో రాహుల్ గాంధీ మరియు అతని సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రోడ్ షోలో ప్రసంగించనున్నారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటకలో ఉన్నారు. ఆయన తాజాగా బెంగళూరులో డెలివరీ వర్కర్స్ తో ముచ్చటించారు. ఈ మేరకు రాహుల్ రెస్టారెంట్‌లో మసాలా దోస మరియు కాఫీ కూడా తాగారు. ఈ సందర్భంగా వర్కర్స్ తమ గోడు వెళ్లబోసుకున్నారు. చదువుకున్నప్పటికీ తక్కువ జీతంతో ఉద్యోగాలు చేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు. ఒక్క బెంగళూరులోనే రెండు లక్షల మందికి పైగా డెలివరీ వర్కర్లు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ ఒక పోస్ట్‌లో “రాహుల్ గాంధీ ఈ రోజు బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎయిర్‌లైన్స్ హోటల్‌లో డన్జో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ మొదలైన డెలివరీ భాగస్వాములతో సంభాషించారు” అని ట్వీట్ చేసింది. అంతకుముందు రాహుల్ గాంధీ స్కూటీ నడుపుతూ కనిపించారు. మరోవైపు బెంగళూరులో రాహుల్ గాంధీ రోడ్‌షోలు, సమావేశాలపై బీజేపీ విరుచుకుపడింది. మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కవర్ చేసే విధంగా రాహుల్ గాంధీ రోడ్‌షోలు ప్లాన్ చేశారని బీజేపీ ఆరోపించింది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడించనుంది ఈసీ.

Read More: Telugu Girl Killed: అమెరికాలో కాల్పుల ఘటనలో తెలుగు యువతి మృతి!