Rahul Gandhi On Karnataka : రాహుల్ ఆప‌రేష‌న్ క‌ర్ణాట‌క‌

2023లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం నుంచి రెండు రోజుల షెడ్యూల్ చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - March 31, 2022 / 01:07 PM IST

2023లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం నుంచి రెండు రోజుల షెడ్యూల్ చేసుకున్నాడు. అందుకోసం అనేక సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్‌ రాష్ట్ర పర్యటనపై మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే.. తాను సీనియర్ నేతలతో సమావేశమవుతానని, రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నానని చెప్పారు. సీనియర్ నేతలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్, పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో ఆయన సమావేశమవుతారని, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారని ఖర్గే వెల్ల‌డించాడు. గురువారం సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో తుమకూరులోని శ్రీ సిద్ధగంగా మఠాన్ని సందర్శించే అవకాశం ఉంది. జ‌యంతి సంద‌ర్భంగా డాక్టర్ శ్రీ శివకుమార స్వామికి నివాళులర్పించే అవకాశం ఉంది. బెంగళూరు నేతలతో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ సమావేశం కానున్నారు. శుక్రవారం కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించి అగ్రనేతలతో కూడిన కార్యవర్గ సమావేశానికి రాహుల్ హాజరుకానున్నారు.