Tribal Girls suicides: ‘గిరిజన’ యువతుల్లో ‘డ్రగ్స్’ నరకం!

అది కేరళలోని గిరిజన కుటుంబం. ఓ రంగులో ఇంటి ముందర మోహనన్ పెరట్లో కూర్చుని, ఆవేశంతో పచ్చి మిరపకాయలు ఏరుతున్నాడు. అతని ముఖంలో కన్నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతున్నాడు.

  • Written By:
  • Updated On - February 5, 2022 / 05:46 PM IST

అది కేరళలోని గిరిజన కుటుంబం. ఓ రంగులో ఇంటి ముందర మోహనన్ పెరట్లో కూర్చుని, ఆవేశంతో పచ్చి మిరపకాయలు ఏరుతున్నాడు. అతని ముఖంలో కన్నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. మోహనన్ ను ఒక్కసారి కదిలిస్తే.. “ఈ ఇల్లు స్వర్గం. కానీ ఇప్పుడు ఇదే నరకం”గా మారిందని సమాధానమిచ్చాడు. మోహనన్, కుటుంబం తిరువనంతపురం నగరానికి 42 కిలోమీటర్ల దూరంలో పలోడ్ ప్రాంతంలోని కణిక్కర్ గిరిజన స్థావరంలో నివసిస్తున్నారు. పలోడ్, వితుర గిరిజన స్థావరాలు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇద్దరు మైనర్‌లతో సహా ఐదుగురు యువతులు ఆత్మహత్య చేసుకోవడంతో గిరిజన గ్రామాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. వాళ్లలో ఒకరు నవంబర్ 1న మరణించిన మోహనన్ కుమార్తె 17 ఏళ్ల ప్రియ. ఈ మరణాలు సమస్యాత్మక సంబంధాల కారణంగా సంభవించాయని భావించినప్పటికీ, అవి చాలా లోతైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గిరిజన గూడెల్లో 10 నుంచి 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. కనీస వసతులు ఉండవు. రవాణా సౌకర్యం అతంతమాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎక్కువ మంది లైంగికంగా దోపిడీకి గురయ్యారు.

గత సెప్టెంబర్‌లో ఒక రోజు ఉదయం ప్రియ అనే యువతి తన తండ్రికి తాను తప్పు చేశానని, గంజాయి వాడే అబ్బాయితో టచ్‌లో ఉన్నానని చెప్పింది. “ఆమె అలా చెప్పినప్పుడు నేను వణుకుతున్నాను. కానీ నేను తెచ్చుకొని వివరాలు అడిగాను. అలాన్ పీటర్ అనే వ్యక్తికి ఇద్దరు అమ్మాయిల ద్వారా పరిచయం ఏర్పడిందని ఆమె చెప్పింది” అని మోహనన్ గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అమ్మాయిలు వస్తారని, అలాన్‌కి వీడియో కాల్ చేయడానికి వారి ఫోన్‌ని ఉపయోగిస్తారని ప్రియ తన తండ్రికి చెప్పింది. ప్రియా తనకు గంజాయి గురించి ఏమీ తెలియదని పట్టుబట్టింది. అయితే మందు ఉన్న స్వీట్‌ను తీసుకున్నట్లు అంగీకరించింది. “నేను ఆమెను ఓదార్చాను. సంబంధాన్ని కొనసాగించనని ఓకే చెప్పింది. దాని గురించి తర్వాత మాట్లాడవద్దని మమ్మల్ని కోరింది” అని మోహనన్ చెప్పారు. కానీ సమస్య అక్కడితో ముగిసేలా కనిపించలేదు. ప్రియ నిరాశలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. “తాను విడిచిపెట్టలేని ఉచ్చులో ఉన్నానని కూడా ఆమె నాకు చెప్పింది. నన్ను పట్టుకొని బిగ్గరగా” అని తండ్రి గుర్తు చేసుకున్నారు.

ప్రియ తన డిగ్రీ కోర్సు ప్రారంభించడానికి తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో చేరింది. కూతురి అడ్మిషన్ కార్డ్ చూసి సుజాత ఓదార్చలేకపోయింది. తన తండ్రితో మాట్లాడిన తర్వాత తన కూతురు సంతోషంగా, ఉల్లాసంగా కనిపించిందని చెప్పింది. “కానీ ఆమె భయంతో ఉన్నట్లు నేను భావించాను. ఆ ఇద్దరు అమ్మాయిలను చూడగానే లోపలికి పరిగెత్తింది. చాలాసార్లు ఆమె కళ్లలో భయం చూశాను’’ అంది యువతి తల్లి. అక్టోబరు 31వ తేదీ రాత్రి ప్రియ తన గది తలుపు తీయడం సుజాతకి వినిపించింది. కొంత సమయం గడిచిన తర్వాత, ఆమె వెళ్లి తనిఖీ చేసింది. “మొదట నేను ఆమె దుప్పటి కప్పుకుని నిద్రిస్తోందని అనుకున్నాను. కాని నేను తిరిగి వెళ్లి మళ్లీ చూడగా, ప్రియ తన మూడు బొమ్మలను దుప్పటిలో కప్పి ఉందని, అక్కడ లేదని నేను గ్రహించాను” అని సుజాత చెప్పారు. చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది బంధువులతో కలిసి కుటుంబసభ్యులు ఆ ప్రాంతంలో వెతికారు. అలాన్ పీటర్‌కి ఫోన్ చేసి ఆమె అతనితో ఉందో లేదో కూడా చూసుకున్నారు. “పోలీసులకు ఫోన్ చేస్తామని ప్రియ మామ అలాన్‌ని బెదిరించాడు. ఆమెను ఇంట్లో దింపమని అడిగాడు. మేము పిలిచిన ప్రతిసారీ త్వరలో డ్రాప్ చేస్తానని చెబుతూనే ఉన్నాడు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఓ గుడి దగ్గర ఉందని అతను చెప్పాడు. హడావిడిగా గుడికి వెళ్లి అక్కడ కూర్చోవడం చూశాం’’ అని చెప్పింది సుజాత.

మరుసటి రోజు ఉదయం మోహనన్ తన రబ్బరు ట్యాపింగ్ పనికి వెళ్ళినప్పుడు ప్రియ ఇంటి ముందు ఇంటిని శుభ్రం చేస్తోంది. సుజాత కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళింది. అనంతరం ప్రియ అమ్మమ్మ ఇంటికి వచ్చి పరిశీలించగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. “మా అమ్మ నా కూతురు వెళ్ళిపోయిందని బిగ్గరగా ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది.” అని మోహనన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. “అప్పుడే నా కూతురు చెప్పింది నిజమని నాకు అర్థమైంది. ఆమె పెద్ద ఉచ్చులో పడటంతో.. బయటకు రాలేకపోయింది ”అని చెప్పాడు. మోహనన్, సుజాత తమ కుమార్తె చావుకు అలన్, అతని ముఠా ప్రమేయం ఉందని ఆరోపిస్తూ చాలాసార్లు పోలీసులను ఆశ్రయించారు. అయితే 60 రోజులుగా ప్రియను లైగింక వేధింపులకు గురి చేసి ఉండొచ్చని తేలినా.. ఆధారాలు లేవని పాలోడ్ పోలీసులు చర్యలు తీసుకోలేదు. చివరకు జనవరి 2022లో అలాన్‌ను అరెస్టు చేశారు. ప్రియ ఇంటికి 10 కి.మీ దూరంలో పలోడ్‌లోని అగ్రిఫార్మ్ సమీపంలోని కన్నికర్ కుగ్రామంలో మరో 16 ఏళ్ల అమ్మాయి శృతి, మూడు వారాల తర్వాత నవంబర్ 21 న మరణించింది. “మా కూతురు చనిపోయిన తర్వాత పోలీసులు మా మాట విని ఉంటే, ఈ కేసులో నిందితుడు అలాన్‌కి పరిచయస్తుడు కాబట్టి, శృతిని కాపాడి ఉండేవారు. కానీ పోలీసులు మా కేసుపై 64 రోజులు కూర్చున్నారు” అని మోహనన్ ఆరోపించారు.

శృతితో సంబంధం ఉన్న శ్యామ్ అనే వ్యక్తి అలాన్‌తో ముఠాలో ఉన్నట్లు ఆ ప్రాంతంలోని గిరిజన హక్కుల కార్యకర్తలు గుర్తించారు. 11వ తరగతి చదువుతున్న శృతి మెరిట్ స్టూడెంట్. 10వ తరగతిలో ఎక్కువ మార్కులకు అవార్డు కూడా అందుకుంది. ఆమె తండ్రి జయచంద్రన్, దినసరి కూలీ. “శృతి మరణానికి ఒక రోజు ముందు, ఆమె అత్త ఒక వ్యక్తితో ద్విచక్ర వాహనంపై ఆమెను చూసింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. నిలదీయగా వాళ్లతో స్నేహ సంబంధాలు ఉన్నట్టు ఒప్పుకుంది. అయితే యుక్త వయసులో అలాంటి సంబంధాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కాబట్టి మేము దానిని పెద్దగా సమస్య చేయలేదు. ప్రియ మరణం గురించి నేను విన్నాను, కానీ నేను దానిని దానితో కనెక్ట్ చేయలేదు, ”అని జయచంద్రన్ అన్నారు. మరుసటి రోజు, కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉన్నారు, కానీ శృతి అక్కడ లేదు. జయచంద్రన్ ఇంటి చుట్టుపక్కల గాలించగా శృతి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. శృతి చనిపోయే ముందు శ్యామ్‌ను సంప్రదించిందని, స్నేహ సంబంధంలో ఉన్న సమస్యలే ఆమె మరణానికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సెప్టెంబరు 2021లో, 19 ఏళ్ల మహిళ, శృతి, పొరుగున ఉన్న అంజనా కూడా ఇలాంటి పరిస్థితులలో ఆత్మహత్యతో మరణించింది. కొల్లం జిల్లాకు చెందిన వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పాలోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శృతి మరణం మూడు నెలల్లో మూడోది. బాలికలందరూ కనిక్కర్ గిరిజన వర్గానికి చెందినవారు. డిసెంబర్ 3, 2021, జనవరి 10, 2022 న, పొరుగు పంచాయతీ అయిన వితురలో మరో ఇద్దరు మహిళలు మరణించారు. 19 ఏళ్ల రేష్మి, కృపా ముఠా సంబంధాల సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. కృపా మృతికి సంబంధించి అరెస్టయిన ఆకాష్, ఆమె మరణించిన వెంటనే ఆమె ఇంటికి చేరుకుని, ఫోన్ రికార్డులను చెరిపేసేందుకు ఆమె ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశాడు. అయితే ఇరుగుపొరుగు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేష్మ మృతికి సంబంధించిన నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు. ప్రియా మరణించిన అరవై రోజుల తర్వాత, జనవరి 1, 2022న, కేసులో నిందితులు అలాన్ పీటర్, అతని ఫ్రెండ్స్ విట్టిక్కావులోని ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించారు. “వారు ముట్టుకోలేరని మమ్మల్ని ఎగతాళి చేశారు. మూడు మరణాలపై మీడియా రిపోర్టింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత, అది పెద్ద చర్చగా మారిన నాలుగు రోజుల తర్వాత అతన్ని అరెస్టు చేశారు, ”అని మోహనన్ అన్నారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకున్నారని తిరువనంతపురం రూరల్ పోలీసు సూపరింటెండెంట్ దివ్య గోపీనాథ్ మీడియాకు తెలిపారు. “పాలోడ్ నుండి వచ్చిన మూడు కేసులలో, ఇద్దరిపై నిందితులపై పోక్సో అభియోగాలు ఉన్నాయి. ఆ కేసుల్లో మేము ఫిజికల్ రిలేషన్ ఉన్నట్టు తేలింది. ప్రియా కేసులో, నిందితులు మరో కులానికి చెందిన వారు కావడంతో ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు,  షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మరో రెండు కేసులు వితురలో ఉన్నాయి.

ఆదివాసీ క్షేమసమితి సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన హక్కుల కార్యకర్త కురుప్పుంకల అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో డ్రగ్స్‌ వినియోగంపై చాలా కాలంగా ఫిర్యాదులు చేస్తున్నామన్నారు. “ఈ అమ్మాయిలను పట్టుకోవడానికి కొంతమంది బయటి వ్యక్తులు గిరిజన ఆవాసాలకు చెందిన యువకులను ట్రాప్ చేస్తారు. ప్రియ అనే యువతి పోస్టుమార్టం రిపోర్టు చూసి షాక్ అయ్యాం’’ అని చెప్పారు. పోస్టుమార్టంలో ప్రియకు డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రియా తప్ప మిగతా తల్లిదండ్రులకు డ్రగ్స్ వినియోగంపై ఎలాంటి సమాచారం లేదు. “ఇంకా సరైన విచారణ ప్రారంభించలేదు. ప్రియా మినహా మిగిలిన బాలికలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ఎలాంటి వివరాలు అందించలేదు. నవంబర్ 1 మరణం తర్వాత వారు సరైన చర్య తీసుకుంటే రెండో మరణం జరిగేదీ కాదు”అని పలోడ్‌కు చెందిన మరో గిరిజన కార్యకర్త అనిల్ కుమార్ కట్టింకుజి అన్నారు. “ఈ అమ్మాయిలందరూ చదువుకున్నారు. ఇతర రంగాల్లో నైపుణ్యం ఉంది. గిరిజన యువతులు ఆత్మహత్య చేసుకోవడంతో గిరిజన తండాల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులకు పంపడం కంటే వారికి పెళ్లి చేయడం సురక్షితమని చాలామంది భావించవచ్చు. ఇది మా సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది” అని ఆయన అన్నారు.

ఈ ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ కూడా ఈ ప్రాంతంలోకి డ్రగ్స్ అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఎత్తిచూపారు. ఈ కేసుల్లో నిందితుల్లో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు అంగీకరించినప్పటికీ రాకెట్‌కు పాల్పడే అవకాశం లేకపోలేదు. గిరిజన స్థావరాలలోని యువత ఈ దుర్మార్గాల బారిన పడడానికి బలహీనతలే ప్రధాన కారణమని గిరిజన ఉద్యమకారిణి ధన్య రామన్ అన్నారు. “మనం పెరిగిన సామాజిక వాతావరణంతో గిరిజన యువకులు ఎదుర్కొనే అభద్రత, అవగాహన లోపం చాలా ఉన్నాయి. వీటన్నింటినీ బయటి వ్యక్తులు సులభంగా దుర్వినియోగం చేయవచ్చు”అని తెలిపారు.

ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

తమిళనాడు

రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆత్మహత్య హెల్ప్‌లైన్: 104

స్నేహ సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్ – 044-24640050 (తమిళనాడులో ఏకైక ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌గా జాబితా చేయబడింది)

ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్య నివారణ: 78930 78930

రోష్ని: 9166202000, 9127848584

కర్ణాటక

సహాయ్ (24-గంటలు): 080 65000111, 080 65000222

కేరళ

మైత్రి: 0484 2540530

చైత్రం: 0484 2361161

తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వ ఆత్మహత్యల నివారణ (టోల్‌ఫ్రీ): 104

రోష్ని: 040 66202000, 6620200