Site icon HashtagU Telugu

Michaung Cyclone : ఆ నాల్గు జిల్లాలకు పబ్లిక్ హాలిడే

Michaung Cyclone

Michaung Cyclone

మిచాంగ్ తూఫాన్ (Michaung Cyclone) తమిళనాడును అతలాకుతలం చేస్తుంది..ఎక్కడిక్కడే వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే స్టేషన్లతో పాటు విమాన శ్రయాలు సైతం నీటితో మునిగిపోయాయి. అనేక రహదారులు తెగిపోయాయి. తుపాను కారణంగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాలకు డిసెంబర్​ 5 మంగళవారం సెలవు దినంగా తమిళనాడు (Tamilanadu) ప్రభుత్వం ప్రకటించింది.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారిన దీనికి మిచాంగ్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో ఉంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి ఈరోజు డిసెంబర్ 4న ఏపీ ,తమిళనాడుతో పాటు పశ్చిమ మరియు మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాను తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. రామలింగాపురం, మాగుంట లేఔట్, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాయుడుపేట – వెంకటగిరి మధ్య రాకపోకలు స్తంభించాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మైపాడు, కొత్తకోడూరు, తుమ్మలపెంట, తూపిలి పాలెం వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే తూఫాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే దాదాపు 142 రైళ్లను రద్దు చేసింది. నేడు పలు రైళ్లను రద్దు చేయగా..రేపు (మంగళవారం) విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17488), చెన్నై-విశాఖ (22870), బెంగళూరు-హౌరా (12246), బెంగళూరు-గౌహతి (12509), బెంగళూరు-హటియా (12836), చెన్నై-హౌరా మెయిల్‌ (12840), షాలిమార్‌-చెన్నై కోరమండల్‌ (12841), చెన్నై-షాలిమార్‌ కోరమండల్‌ (12842), ఎర్నాకులం-టాటానగర్‌ (18190), బెంగళూరు-హటియా (18638), విల్లుపురం-ఖరగ్‌పూర్‌ (22604) రద్దు చేసింది.

బుధువారం (డిసెంబర్ 06) కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17487), కోయంబత్తూర్‌-బరౌని (03358), బెంగళూరు-గౌహతి (12509), షాలిమార్‌-నాగర్‌కోరుల్‌ (12660), చెన్నై-హౌరా మెయిల్‌ (12842), పుదుచ్చేరి-హౌరా (12868), అలెప్పీ-ధన్‌బాద్‌ బొకారో (13352), కన్యాకుమారి-డిబ్రుగర్‌ (22503), ఎర్నాకులం-హటియా (22838), తంబరం-సంత్రాగచ్చి (22842), బెంగళూరు-హౌరా (22864) రద్దు.

గురువారం (డిసెంబర్ 07) కన్యాకుమారి-డిబ్రుగర్‌ (22503), ఖరగ్‌పూర్‌-విల్లుపురం (22603), పాట్నా-ఎర్నాకులం (22643), బెంగళూరు-ముజాఫర్‌పూర్‌ (15227), అలెప్పీ-ధన్‌బాద్‌ బొకారో (13352) రద్దు. డిసెంబర్ 8న సిలిఘాట్‌-తంబరం (15630) రద్దు చేశారు.

Read Also : Capital Of AP : జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం

Exit mobile version