ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్ వర్తింపజేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం .. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రొబేషన్‌ను పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పే స్కేల్‌ను ఫిక్స్ చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ గ్రేడ్-5 ఉద్యోగులకు బేసిక్ పే స్కేల్ ను రూ.23,120 నుంచి రూ.74, 770గా నిర్ణయించారు. మిగతా ఉద్యోగుల పే స్కేల్ ను సైతం రూ.22,460 నుంచి రూ.72,810గా ఖరారు చేశారు. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కానుండటంతో.. వీరందరికీ ఆగస్టు నుంచి కొత్త జీతాలు అందనున్నాయి. ఈ బేసిక్ శాలరీకి డీఏ,హెచ్‌ఆర్‌ఏ కలిపితే ఒక్కో ఉద్యోగికి రూ.30 వేల దాకా అందుతాయి. ఈవిషయాన్ని జగన్ సర్కారు అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన వారికి కూడా తొందరగా ప్రొబేషన్ కల్పించాలని కోరుతున్నారు. కాగా,
ఆత్మకూరు ఉప ఎన్నికతో సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియలో జాప్యం జరిగింది. లేదంటే ముందుగానే దీనిపై ప్రకటన వెలువడి ఉండేదని అంటున్నారు.
AP Govt Pay Scale: గ్రామ సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Secretariat