తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంత అనుకున్నారు కానీ ఆయన్ను ఓడించి..కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారని మాత్రం బిఆర్ఎస్ నేతలు కూడా కలలో కూడా అనుకోలేదు. రేవంత్ మాటకారితనం , తెలంగాణ ను ప్రత్యేకరాష్ట్రం ఇచ్చినందుకు సోనియా పై గౌరవం , పదేళ్ల బిఆర్ఎస్ పాలనా చూసాం..ఒక్కసారి కాంగ్రెస్ పని తీరు ఎలా ఉంటుందో చూద్దాం..అని, రుణమాఫీ , ఉచిత పథకాలు ఇలా హామీలు కూడా ప్రజల్లో కేసీఆర్ ను కాదని రేవంత్ కు ఓటు వేసేలా చేసాయి.
కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించి తప్పు చేశామని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దగ్గరదగ్గరగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది దగ్గరికి వస్తున్న ఇంతవరకు హామీలు అమలు చేయలేదు..చేసిన హామీలు కూడా పూర్తి స్థాయిలో చేయలేదు..ఎలాంటి అభివృద్ధి లేదు..అసలు ఏంచేస్తున్నారో..కూడా అర్థంకాని పరిస్థితి. ఇదే తరుణంలో తెలంగాణ సొమ్మను అంత సీఎం రేవంత్ ఢిల్లీకి మోస్తున్నారనే ఆరోపణలు ఇలా ప్రతిదీ కూడా కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో ఆగ్రహం నింపుతూ వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఈరోజు వయనాడ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ హెలికాప్టర్..వాడడం చూసి ప్రతి ఒక్కరు నిజమే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వయనాడ్ (Wayanad ) ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
2019 నుంచి కాంగ్రెస్‌లో ప్రియాంక క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు కూడా భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు సీట్లల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అవి.. తల్లి సోనియా గాంధీకి చెందిన రాయ్‌బరేలీ, 2019లో తాను గెలిచిన కేరళ వయనాడ్ సీటు. ఈసారి.. ఆయన ఆ రెండు సీట్లల్లోనూ విజయం సాధించారు. రాజ్యాంగం ప్రకారం.. ఆ రెండింట్లో ఒకటి ఒదులుకోక తప్పలేదు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోవడంతో..అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈరోజు వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు (Priyanka Gandhi’s Nomination Filed) చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి ఆమె భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు , ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు అగ్రనేతలు ఇలా చాలామందే హాజరయ్యారు. స్థానిక నేతల సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ప్రియాంక గాంధీ నామినేషన్‌కు వాడిన హెలికాప్టర్ తెలంగాణది.. వరదల సమయంలో ప్రజలను కాపాడడానికి లేని ప్రియాంక గాంధీ కోసం వాడుతున్నారా అంటూ నెటిజన్ల విమర్శలు చేస్తూ ఆ వీడియో ను వైరల్ చేస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రజల సొమ్మను రాహుల్ , సోనియా , ప్రియాంక లకు ఖర్చు పెడుతున్నారని , ఇది కాంగ్రెస్ ను గెలిపించుకునే దక్కే ప్రతిఫలం అంటూ నెటిజన్లు కామెంట్స్ వేస్తూ వీడియో ను వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
వయనాడ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ హెలికాప్టర్? ప్రియాంక గాంధీ నామినేషన్‌కు వాడిన హెలికాప్టర్ తెలంగాణది.. వరదల సమయంలో ప్రజలను కాపాడడానికి లేని ప్రియాంక గాంధీ కోసం వాడుతున్నారా అంటూ నెటిజన్ల విమర్శలు. #PriyankaGandhiVadra #WayanadLokSabhaConstituency #RahulGandhi #HashtagU pic.twitter.com/Tgmq8xlGpZ
— Hashtag U (@HashtaguIn) October 23, 2024
Read Also : Jeevan Reddy Comments : రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా? – KTR