రోమ్ లో ప్రధాని మోడీ పర్యటన..ఘన స్వాగతం పలికిన ఇండియన్స్

నరేంద్ర భాయ్ కేమ్ ఛో..! అన్న వ్యక్తి...నవ్వుతూ సమాధానమిచ్చిన ప్రధాని

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 12:08 PM IST

నరేంద్ర భాయ్ కేమ్ ఛో..! అన్న వ్యక్తి…నవ్వుతూ సమాధానమిచ్చిన ప్రధాని

రోమ్ లో రెండు రోజుల పాటు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. దేశానికి సంబంధించిన వివిధ అంశాలతో పాటు స్థిరమైన అభివృద్ధి మరియు వాతావరణ మార్పులపై దృష్టి సారించేలా ఈ సదస్సు కొనసాగనుంది. G-20 శిఖరాగ్ర సదస్సు కోసం రోమ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, “పియాజ్జా గాంధీ” వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.అక్కడ భారతీయుల బృందం ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికారు.అనంతరం అక్కడి భారతీయులతో మోడీ మాట్లాడారు.పియాజ్జా గాంధీ వద్ద ఇండియా ఫ్లాగ్లను పట్టుకున్న వ్యక్తులతో ప్రధాని మోదీ సంభాషిస్తున్నప్పుడు ‘మోదీ, మోదీ’ నినాదాలు వినిపించాయి.వారంతా సంస్కృత శ్లోకాలను పఠించారు.వారితో పాటు మోడీ కూడా ఓం నమః శివాయః అని అన్నారు.

నరేంద్ర భాయ్ కేమ్ ఛో!” అని ఓ వ్యక్తి గట్టిగా అరవడంతో ప్రధాని మోడీ విని “మజా మా చో” అని నవ్వుతూ బదులిచ్చాడు.తాను యోగా మరియు ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నానని ఓ వ్యక్తి గుజరాతీలో మాట్లాడగా… ప్రధానమంత్రి తన మాతృభాషలో సమాధానం ఇచ్చారు. సమావేశానికి ముందు మోడీ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ మరియు రోమ్లోని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్తో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.