Bihar Politics: నితీష్ విపక్షాల రాజకీయంపై పీకే కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Bihar Politics

New Web Story Copy 2023 06 06t173141.249

Bihar Politics: ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే సౌత్ లోని కొందరు నాయకులతో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఇప్పటికే ఆయన భేటీ అయ్యారు. భవిష్యత్తు రాజకీయాలపై నితీష్ కాంగ్రెస్ తో చర్చలు జరిపారు.

విపక్షాల ఐక్యతకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన నితీష్‌ను టార్గెట్ చేశారు. సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ…నితీష్ కుమార్ పరిస్థితి అంధుల్లో కనరాజాలా ఉందని అన్నారు. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ఒక్కడే కాదు.. తనకు మాత్రమే అన్నీ తెలుసన్న భ్రమలో ఉన్నాడు. అందుకే తన చుట్టూ ఉన్న మూర్ఖులందరినీ కూడబెడుతున్నాడని కామెంట్స్ చేశారు పీకే.

నితీష్ కుమార్ విద్యావంతుడు కావచ్చు, కానీ తనకంటే విద్యావంతులు, మేధావులు వేల సంఖ్యలో ఉన్నారని అన్నారు. కావలసిందల్లా అధికారంలో ఉన్నప్పుడు విద్యావంతులు మరియు మేధావుల సహాయం తీసుకోవాలని హితవు పలికారు. లోక్‌సభలో ఆర్జేడీకి ఒక్క ఎంపీ కూడా లేడని విమర్శించారు పీకే.

Read More: Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్

  Last Updated: 06 Jun 2023, 05:31 PM IST