దేశ వ్యాప్తంగా ఈడీ రైడ్స్ (ED) కొనసాగుతున్నాయి..గత కొద్దీ రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫై రైడ్స్ జరుగుతూ వస్తున్నాయి. తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కు షాక్ ఇచ్చింది ఈడీ. రూ. 100 కోట్ల పోంజీ స్కామ్ (Ponzi Scam)లో భాగంగా ఈడీ విచారణకు హాజరుకావాలని ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఏడాది అక్టోబర్ లో ప్రణవ్ జ్యుయెలర్స్ (Pranav Jewellers) బోర్డు తిప్పేసింది. సదరు సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ లో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్ జ్యుయెలర్స్ బ్రాంచ్‌లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి. ప్రణవ్ జ్యువెల్లర్స్‌కి ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చే వారం చెన్నైలోని ఈడీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Read Also : Kodi Ramakrishna : కోడి రామకృష్ణ తలకట్టు వెనుక ఉన్న కారణం ఏంటి..?