Site icon HashtagU Telugu

Eluru Factory: పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదానికి కార‌ణం అదే..?

fire

fire

ఏలూరు జిల్లాలోని పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఈ నెల 13 న అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు స‌జీవ ద‌హం అయ్యారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై మాన‌వ‌హ‌క్కుల వేదిక నివేదిక తీసుకుంది. ఫ్యాక్ట‌రీలో విద్యుత్ వైఫల్యం, బ్యాకప్ సిస్టమ్ లోపం కారణంగా సంభవించిందని మానవ హక్కుల వేదిక పేర్కొంది. సంఘటన జరిగిన రాత్రి రియాక్టర్లు శీతలీకరణ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. చిల్లర్ సిస్టమ్ నుండి రియాక్టర్‌లకు మైనస్ 16 డిగ్రీల వద్ద ఉప్పునీటి ద్రావణాన్ని నిరంతరం సరఫరా చేయడం చాలా అవసరం. పవర్ ఆఫ్ అయినప్పుడు, కార్మికులు బ్యాటరీలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ స‌మ‌యంలో ప్రత్యామ్నాయ పవర్ సిస్టమ్‌లను ఉపయోగించి సిస్టమ్‌ను శక్తివంతం చేయడానికి ప్రయత్నించారు. ఇది పూర్తయ్యే సమయానికి రియాక్టర్ వేడెక్కి మంటలు వ్యాపించాయ‌ని మాన‌వ‌హ‌క్కుల వేదిక తెలిపింది.

ఆరుగురు కార్మికుల దారుణ మరణానికి, 12 మంది కార్మికులకు ప్రాణాంతక గాయాలకు కారణమైన పోరస్ లేబొరేటరీస్ ప్రైవేట్ కెమికల్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేయాలని HRF డిమాండ్ చేస్తోంది. కంపెనీ నిర్వహణ, నియంత్రణ సంస్థల అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం తాము పిలుపునిస్తామ‌ని మాన‌వ‌హ‌క్కుల వేదిక తెలిపింది. బీహార్ నుండి దాదాపు 50 మంది వలస కార్మికులను తిరిగి ఇంటికి పంపడానికి ప్రభుత్వం, కంపెనీ వెంటనే ఏర్పాట్లు చేయాలని HRF రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు G రోహిత్ అన్నారు. ఇద్దరు సభ్యుల హెచ్‌ఆర్‌ఎఫ్ బృందం ఏప్రిల్ 16న గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులు, బాధిత కుటుంబాలు, ప్లాంట్ ఉద్యోగులు, ప్లాంట్‌లోని మాజీ ఉద్యోగులతో మాట్లాడి వాస్తవాలను నిగ్గుతేల్చింది. విపత్తును నివారించే అవకాశం ఉన్న ఆటోమేటిక్ డిటెక్షన్, బ్లాకేజ్ సిస్టమ్‌లు ఫ్యాక్ట‌రీలో లేవ‌ని.. ఇది యాజమాన్యం నేరపూరిత నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని స్ప‌ష్టం చేసింది. గాయపడిన, చనిపోయిన వారిని తరలించడంలో ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంద‌ని మాన‌వ‌హ‌క్కుల వేదిక స‌భ్యులు తెలిపారు.