Poonam Kaur : దేవెగౌడ మనవడు ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలపై పూనమ్ కౌర్ వీడియో మెసేజ్

Poonam Kaur : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించారు.

  • Written By:
  • Updated On - April 30, 2024 / 01:19 PM IST

Poonam Kaur : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఒక నాయకుడి కొడుకు ఫోన్ ట్యాపింగ్‌ చేసి మహిళలను బ్లాక్ మెయిలింగ్‌ చేస్తే.. మరో నాయకుడి కొడుకు అమ్మాయిల్ని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె మండిపడ్డారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎంతోమంది మహళలను లైంగిక వేధింపులకు గురిచేసి, బలవంతంగా అశ్లీల వీడియోలు తీశాఢని పూనమ్ ఆరోపించారు. ‘‘డబ్బు, అధికారం రెండూ ఉన్నవాళ్లను మన ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు అతడు జర్మనీలో హాయిగా గడుపుతున్నాడు. అతడికి శిక్ష పడుతుందో లేదో కూడా కచ్చితంగా మనం చెప్పలేం’’ అని ఆమె కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘మీ అందరికీ చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను.. మీ కుమార్తెలపై, మీ సోదరీమణులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా దయచేసి ఓటు వేయండి. కానీ ఇలా మహిళలను వేధించే వారికి, స్త్రీలను గౌరవించని వారికి ఓటు వేయొద్దు. ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి వేయండి. అన్యాయం చేసేవారికి అధికారం ఇవ్వకండి’’ అని పూనమ్ కౌర్ కోరారు. ‘‘మహిళలను శక్తులుగా పూజించే  దేశంలో ఇలాంటి నీచులను గెలిపిద్దామా? మహిళలపై లైంగిక దౌర్జ్యనాలకు పాల్పడిన వీడియోలు తీసిన ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు.. జంతువులు కూడా అలా చేయవు.. ఈ దేశం రావణ రాజ్యం వెళ్తోందా?, రామ రాజ్యంవైపు వెళ్తోందా?’’ ఆమె ప్రశ్నించారు.

Also Read :Prizes For Voters : ఓటర్లకు లక్కీ డ్రా.. డైమండ్ రింగ్, ల్యాప్‌టాప్ గెల్చుకునే ఛాన్స్

మేం భయపడి పారిపోం.. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ

నాలుగేళ్ల పాత వీడియోలతో తన కుమారుడిపై రాజకీయ ప్రత్యర్ధులు కుట్ర చేశారని ఎంపీ ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అంటున్నారు. తాము భయపడి పారిపోయే రకం కాదన్నారు. ఎలాంటి కుట్ర జరుగుతోందో తమకు తెలుసన్నారు. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం అనేది జేడీఎస్ అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. గత 40 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తాము చాలా దర్యాప్తులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. సిట్‌ లేదా సీఐడీకి దర్యాప్తును అప్పగించాలని రేవణ్ణ కోరారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తరువాత స్పందిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం ఏమి తేలుస్తుందో చూడాలని చెప్పారు.