TN Death: త‌మిళ‌నాడులో విద్యార్థిని మృతిపై పోలీసుల విచారణ స‌రిగాలేదు – త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్‌

త‌మిళ‌నాడులో ఇటీవ‌ల మ‌తంమారాలంటూ ఒత్తిడి చేయ‌డంతో 12వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల విచార‌ణ స‌రిగా లేద‌ని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - January 31, 2022 / 10:16 AM IST

త‌మిళ‌నాడులో ఇటీవ‌ల మ‌తంమారాలంటూ ఒత్తిడి చేయ‌డంతో 12వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల విచార‌ణ స‌రిగా లేద‌ని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై ఆరోపించారు.

పోలీసులు ఈ కేసును మొదటి నుంచి తూతూమంత్రంగా విచార‌ణ చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎవరైనా మత మార్పిడి జరిగిందని చెబితే పోలీసులు విచారణ చేయాలని.. తటస్థంగా ఉండాల్సిన దర్యాప్తు అధికారి ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి, ఇతర మంత్రులు రంగంలోకి దిగ‌డంతో ఈ కేసు విచార‌ణ‌కు విచారణకు రాజకీయ రంగు పులుముకుంద‌న్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా తాను సమస్యను పరిష్కరించాలని అనుకున్నాన‌ని… ఇది రాజకీయ కాద‌ని బీజేపీ చీఫ్ అన్నామ‌లై తెలిపారు. బిజెపి ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత మాత్రమే కొంత ఒత్తిడి వచ్చిందని.. కోర్టు వీడియో ఆమోదయోగ్యమైన సాక్ష్యంగా చెప్పిందని ఆయ‌న గుర్తు చేశారు. వాయిస్ శాంపిల్ సరిపోలిందని, తారుమారు చేయలేదని దర్యాప్తు అధికారి కోర్టులో సమర్పించారని తెలిపారు.

తాను మొదట్లో క్రైస్తవ పాఠశాలలో చదివానని మ‌త మార్పిడికి ప్ర‌య‌త్నించిన వ్య‌క్తికి శిక్ష పడాల‌ని అన్నామ‌లై డిమాండ్ చేశారు., కేసులో ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దడం త‌న బాధ్యతని…ఏం జరిగిందన్న విషయాన్ని బాలిక పూర్తిగా వెల్లడించలేదని.. ఎనిమిది రోజుల తర్వాత ఆమె విషం తాగినట్లు ఆమె తల్లికి తెలిసిందన్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని.. దురదృష్టవశాత్తు, పోలీసులు కొన్ని విష‌యాల‌ను ద‌ర్యాప్తు చేయ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు.