Political Attack : వేట కొడవళ్లతో దాడి.. పీఎంకే కార్యకర్త పరిస్థితి విషమం

తమిళనాడులో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 5న చెన్నై నగరంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా మర్డర్ చేశారు. 

Published By: HashtagU Telugu Desk
Political Murder

Political Attack : తమిళనాడులో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 5న చెన్నై నగరంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా మర్డర్ చేశారు.  దాన్ని మరువకముందే ఇప్పుడు మరో రాజకీయ హత్యకు దుండగులు యత్నించారు. కడలూర్‌ సమీపంలోని తిరుపాపులియూర్‌లో పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీ కార్యకర్త శివశంకర్‌పై నలుగురు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శివశంకర్ ఇంటి ముందే ఈ ఘటన(Political Attack) చోటుచేసుకుంది. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్‌‌ హత్య కూడా ఇంటి వద్దే జరిగింది. ఆయనను మర్డర్ చేయడానికి దుండగులు బైక్స్‌పై వచ్చారు.  పీఎంకే కార్యకర్త శివశంకర్‌పై(Political Attack) దాడి చేయడానికి కూడా దుండగులు బైక్స్‌పైనే వచ్చారు.

మెడ, నోరు, భుజానికి గాయాలు 

కత్తులతో దారుణంగా దాడి చేయడంతో శివశంకర్‌ శరీరం నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది.  రక్తపు మడుగులో పడి ఉన్న శివశంకర్‌ను హుటాహుటిన చెన్నై నగరంలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మెడ, నోరు, భుజానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం శివశంకర్ పరిస్థితి విషమంగా ఉంది. శివశంకర్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో.. దుండగులు కత్తులు, వేట కొడవళ్లు చేతిలో పట్టుకొని పరుగులు పెడుతూ వస్తున్న సీన్లు నిక్షిప్తం అయ్యాయి. పోలీసులు సీసీకెమెరా ఫుటేజీని సేకరించి, దాడికి పాల్పడిన వారి వివరాలను సేకరించేందుకు యత్నిస్తున్నారు.  వన్నియార్ సంఘం నాయకుడిగా కడలూర్ పరిధిలో శివశంకర్‌‌కు మంచి పేరు ఉండేది. ఈ కేసులో ఓ మైనర్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

పోలీసుల నిర్లక్ష్యమే కారణం : పీఎంకే చీఫ్

పీఎంకే కార్యకర్త శివశంకర్‌‌పై దుండగులు జరిపిన దాడిని ఆ పార్టీ అధినేత అంబుమణి రాందాస్ ఖండించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.  మూడేళ్ల క్రితం  శివశంకర్ సోదరుడు ప్రభు హత్య జరిగింది. ఆ కేసులో ప్రధాన సాక్షిగా శంకర్ ఉన్నాడు. ఈనేపథ్యంలో త్వరలో కోర్టులో జరగబోయే విచారణకు హాజరుకావద్దని రౌడీల ముఠా సభ్యులు  శివశంకర్‌ను బెదిరించారు. ఈవిషయాన్ని పోలీసులకు శివశంకర్ తెలియజేసినా చర్యలు తీసుకోలేదని అంబుమణి రాందాస్ ఆరోపించారు. కనీసం శివశంకర్‌కు రక్షణను కూడా కల్పించలేదన్నారు. పోలీసుల ఈవిధమైన నిర్లక్ష్యం వల్లే శివశంకర్‌పై ఇప్పుడు ఘోర దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తమిళనాడులోని చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు రాజకీయ  హత్యలు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు.

Also Read :BJP – Main Opposition : అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్‌ నిలుపుకునేనా ?

తమిళనాడు సర్కారు సీరియస్

బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మర్డర్‌ కేసు తమిళనాడు సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా చెన్నై పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేసింది.  సందీప్‌ను పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఇన్ ఛార్జ్ డీజీపీగా బదిలీ చేశారు. సీనియర్ పోలీసు అధికారి అరుణ్‌ను చెన్నై సీపీగా నియమించింది.

Also Read :Jogi Ramesh : మాజీ మంత్రి జోగి అరెస్ట్ తప్పదా..?

  Last Updated: 08 Jul 2024, 04:35 PM IST