Modi Gets Emotional : ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ..

11 ఏళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నేత వి.రమేశ్‌ను గురించి మోడీ ఎమోషనల్ అయ్యారు

Published By: HashtagU Telugu Desk
PM Modi Bhutan Postponed

Modi Emoshanal

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇక మరోసారి విజయం సాధించి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టాలని మోడీ (Modi) చూస్తున్నాను. ఈ తరుణంలో తన వయసును సైతం లెక్క చేయకుండా దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారు. ప్రతి రోజు రెండు , మూడు సభలను కవర్ చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు తమిళనాడు లో పర్యటించారు.

We’re now on WhatsApp. Click to Join.

మంగళవారం తమిళనాడు (Tamilanadu)లోని సేలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తమిళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంలోనే మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దానికి కారణం గతంలో తమిళనాడు బీజేపీ నేత హత్యకు గురికాగా.. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.11 ఏళ్ల క్రితం సేలం (Salem) జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నేత వి.రమేశ్‌ (‘Auditor’ Ramesh)ను గురించి మోడీ ఎమోషనల్ అయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ క్షణం సభ మొత్తం సైలెంట్ అయ్యింది. అనంతరం కొద్దిసేపు తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also : Venkateshwara: శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో మీకు తెలుసా?

  Last Updated: 19 Mar 2024, 08:04 PM IST