చిన్న పిల్ల‌ల్లో కోవిడ్ నివార‌ణ‌కు స్పుత్నిక్ రెడీ

చిన్న పిల్ల‌ల్లో కోవిడ్-19 నివార‌ణ‌కు కోసం స్పుత్నిక్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది. ట్ర‌య‌ల్స్ వేయ‌డానికి రెడ్డీస్ ల్యాబ్ సిద్ధం అవుతోంది. తొలి రోజుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ భార‌త్ లో అందుబాబులోకి సకాలంలో రాలేక‌పోయింది.

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 06:00 PM IST

చిన్న పిల్ల‌ల్లో కోవిడ్-19 నివార‌ణ‌కు కోసం స్పుత్నిక్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది. ట్ర‌య‌ల్స్ వేయ‌డానికి రెడ్డీస్ ల్యాబ్ సిద్ధం అవుతోంది. తొలి రోజుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ భార‌త్ లో అందుబాబులోకి సకాలంలో రాలేక‌పోయింది. ఇప్పుడు కోవిడ్-19 ను శాశ్వ‌తంగా నివారించేలా వ్యాక్సిన్ త‌యారు అయింద‌ని కంపెనీ చెబుతోంది.
ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ త్వ‌ర‌లోనే పిల్ల‌ల‌కు అందుబాటులోకి రానుంది. రెండు ర‌కాల వ్యాక్సిన్ల‌ను రెడ్డీస్ ల్యాబ్ చిన్నారుల‌కు త‌యారు చేసింది. ప్ర‌స్తుతం ట్ర‌య‌ల్స్ తుది ద‌శ‌కు చేరుకున్నాయి.

వ‌య‌సు 2 నుంచి 12 మ‌రియు 12 నుంచి 18 వ‌య‌స్సుల మ‌ధ్య ఉండే వాళ్ల‌కు రెండు ర‌కాల వ్యాక్సిన్లు సిద్ధం చేసింది. స్పుత్నిక్ లైట్ ‌క్లీనిక‌ల్ ట్ర‌‌య‌ల్స్ నివేదిక‌ల‌ను
డ్ర‌గ్స్ కంట్రోల్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అందించింది.

చిన్న పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ తో పాటు పెద్ద‌ల‌కు ఒకే బూస్ట‌ర్ డోస్ ను రూపొందించింది. వ‌చ్చే నెల మార్కెట్లోకి వ్యాక్సిన్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆ కంపెనీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. దేశంలో స్పుత్నిక్ త‌యారీ కోసం ఆరు కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మూడు చోట్ల స్పుత్రిక్ లైట్ త‌యారీకి, రెండు ప్రాంతాల‌ను స్పుత్రిక్ త‌యారీకి కు కేటాయించారు.
కోవిడ్-19 నివార‌ణ‌కు ఏ వ్యాక్సిన్ గ‌తంలో తీసుకున్న‌ప్ప‌టికీ స్పుత్నిక్ వేసుకోవ‌డానికి అనువుగా వ్యాక్సిన్ త‌యారు అయింది. మొద‌టి డోసుకు రెండో డోసుకు మ‌ధ్య ఆరు నెల‌లు గ‌డువు ఉండేలా వ్యాక్సిన్ ను రూపొందించారు.
కోవిడ్- 19 నివార‌ణ‌కు వేసుకునే మందు బిళ్ల‌ల‌ను కూడా త‌యారు చేసిన‌ట్టు రెడ్డీస్ ల్యాబ్ వెల్ల‌డించింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ వేయించుకోవ‌డంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం స‌హాయాన్ని కూడా రెడ్డీస్ ల్యాబ్ కోరింది. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఈ వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి అనువుగా అనుమ‌తుల కోసం కేంద్రాన్ని కోరింది.