Site icon HashtagU Telugu

Pawan Kalyan : పంచకట్టులో పవన్ ఏమన్నా ఉన్నాడా..?

Pawan Entry Murugan

Pawan Entry Murugan

ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రజాసేవలో బిజీగా ఉన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా తమిళనాడులో జరిగిన ప్రముఖ మురుగ భక్తర్గల్ మానాడు (Murugan Devotees Meet) కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో నిర్వహించిన ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరుకాగా, పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. తమిళనాడు సాంప్రదాయంలో భాగంగా పవన్ పంచకట్టులో ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Vijay Deverakonda: హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో కేసు!

విమానాశ్రయం వద్ద పంచెకట్టుతో పవన్ కళ్యాణ్ దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మోడ్రన్ వేషధారణలో కనిపించే పవన్ ఇలా సంప్రదాయ డ్రెస్సులో దర్శనమివ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. “పంచకట్టులో పవర్ స్టార్ చూడడం నిజంగా హర్షకరమైన విషయం” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడు అభిమానులతో పాటు ఏపీ జనసేన కార్యకర్తలు కూడా ఈ లుక్ పై ముచ్చటపడుతున్నారు.

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. షాకింగ్ విష‌యం వెల్ల‌డి!

ఇక సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదల కానుంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెట్స్ పై ఉండగా, OG అనే మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ మూడు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై తన శ్రద్ధ తగ్గించకుండా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిజంగా ఆనందాన్ని కలిగిస్తున్నారు.