Site icon HashtagU Telugu

Pawan Kalyan:వైసీపీ ఎంపీలపై మ‌రోసారి జ‌నసేన అధినేత ప‌వ‌న్‌ ఫైర్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుని నిర‌స‌న తెల‌పాల‌ని వైసీపీ ఎంపీల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయ‌న ట్వీట్ చేశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగం చేస్తామని అధికార పార్టీ చేసిన నినాదాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు ప్రాణాలు అర్పించే బదులు పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకోవాలని జనసేన అధినేత సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంబంధించి పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించాలని వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ పవన్ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల వాణిని పార్లమెంటుకు తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలను డిమాండ్ చేశారు.

Exit mobile version