Site icon HashtagU Telugu

Urine : మూత్రమే కదా అని ఈజీగా వదిలేయకండి..అందులో కరెంట్ ఉంది..!!

Urine Into Energy

Urine Into Energy

మూత్రం (Urine )..దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే ద్రవం. ఇది రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది. మూత్రాన్ని రకరకాల మూత్ర పరీక్షల ద్వారా దాని లోని వివిధ పదార్ధాలను గుర్తించి విశ్లేషించవచ్చును. ఇదంతా ఇప్పటివరకు మనకు తెలిసిందే. కానీ మూత్రం నుండి కూడా కరెంట్ తరయారు చేయొచ్చని ఐఐటీ పరిశోధకులు కనిపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

మూత్రం నుంచి విద్యుత్‌తో పాటు జీవ ఎరువును ఉత్పత్తి చేయవచ్చని వీరు నిరూపించి వార్తల్లో నిలిచారు. కేరళలోని ఐఐటీ పాలక్కడ్‌ పరిశోధకులు (Palakkad IIT researchers) దీనిని కనిపెట్టారు. మానవ మూత్రం నుంచి విద్యుత్తు, జీవ ఎరువును (Bio-Fertilizer) ఉత్పత్తి చేసే వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ జర్నల్‌ సపరేషన్‌ అండ్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీలో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్‌ తయారీ కోసం ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు కొత్తగా ఎలక్ట్రో కెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌(ఈఆర్‌ఆర్‌ఆర్‌)ను తయారు చేయడం గమనార్హం. ఇందులో ఎలక్ట్రో కెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌, అమోనియా అధిశోషణ సాధనం, క్లోరినేషన్‌ గది వంటివి భాగాలుగా ఉంటాయి.

ఈఆర్‌ఆర్‌ఆర్‌లో మెగ్నీషియం ఆనోడ్‌గా, గాలిలోని కార్బన్‌ క్యాథోడ్‌గా పనిచేస్తాయి. ఈ టెక్నాలజీ.. మూత్రంలోని అయానిక్‌ శక్తిని ఉపయోగించుకుని ఎలక్ట్రో కెమికల్‌ చర్యలను ప్రేరేపిస్తుంది. దాని ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుందని వీరు నిరూపించారు. ఆ తర్వాత అదే మూత్రం నుంచి నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం అధికంగా ఉన్న జీవ ఎరువును కూడా ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు తయారు చేశారు. ఈ విధానంలో ఉత్పత్తి అయిన విద్యుత్త్‌ను మొబైల్‌ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు.. ఎల్‌ఈడీ బల్బులను వెలిగించేందుకు ఉపయోగించినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగ దశలో ఉందని ఐఐటీ పాలక్కడ్‌ బృందం స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి.. మరింత విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : CAG Report on Hyderabad Metro Rail : ఒప్పందాన్ని తుంగలో తొక్కిన హైదరాబాద్ మెట్రో..ఎంత దారుణం ..!!