Site icon HashtagU Telugu

Chennai Rains: కిటకిటలాడుతున్న హోటల్స్

Flood Chennai

Flood Chennai

బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి, అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట (Tamil Nadu) భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలోని (Chennai ) వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారుల్లో భారీగా వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 15 సెం.మీ కంటే ఎక్కవ వర్షపాతం నమోదు కావడం తో నిత్యావసర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ధనవంతులు హోటళ్లకు వెళ్లిపోతున్నారు. గతేడాది భారీ వరదలతో ఇబ్బందులు పడడంతో ఈసారి ఆ సమస్య లేకుండా ముందే ఖాళీ చేసి వెళ్తున్నారు.

కార్ పార్కింగ్, విద్యుత్, వైఫై సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన హోటళ్లలో దిగుతున్నారు. దీంతో అన్ని హోటల్స్ లలో రూమ్స్ ఫుల్ అవుతున్నాయి. ఏ హోటల్ చూసిన జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఎప్పుడు వర్షాలు పడినా చెన్నై నగరం చెరువైపోతుండడం కామన్ గా మారింది. అక్కడి ప్రజలు సైతం భారీ వర్షాలకు , వరదలకు అలవాటైపోయారు. వాతావరణ మార్పులతో ఏటా తుఫాన్ల ప్రభావం పెరుగుతోంది. 1943లో మొదలైన వరదల తాకిడి ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంది. చెన్నై వరదలకు ప్రకృతి విపత్తుకంటే మానవ తప్పిదాలే ప్రధాన కారణం. చెన్నైలో మొత్తం 6 అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 3 నదులు, 5 తడి నేలలు ఉన్నాయి. అయితే, ఈ ఎకో సిస్టమ్ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. తడి నేలలు, నదుల విస్తీర్ణం తగ్గిపోయింది. నగరం భౌగోలిక పరిస్థితులు కూడా వరద ముప్పునకు కారణం అవుతున్నాయి. సముద్ర మట్టానికి చాలా ప్రాంతాలకు కేవలం 2 మీటర్ల ఎత్తులోనే ఉన్నాయి. వరదలు రాగానే ఈ ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి. మరి ఇక్కడ కూడా హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలను కూల్చేవేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Left Handers : ఎడమచేతి వాటం వారికి ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువట..!