Site icon HashtagU Telugu

Kerala: ఫుట్​బాల్​ మ్యాచ్​లో గ్యాలరీ కూలి.. 60 మందికి గాయాలు..!

Football Gallery Collapse In Kerala

Football Gallery Collapse In Kerala

కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళలోని వాండోర్​లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫుట్​బాల్​ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఉండ‌గా, గ్యాలరీవిరిగి ప‌డింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలపాలయ్యాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాండోర్, కలికావు సమీపంలో పూన్ గోడు అనే గ్రామంలో ఈ స్టేడియంను ఏర్పాటు చేశారు.

ఈ క్ర‌మంలో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారి గ్యాలరీ కూలిపోయింది. దీంతో ప్రేక్షకులంతా స్టేడియం బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఈ తొక్కిసలాటలో చాలామందిత‌కి గాయాలయ్యాయి. స్థానికులే ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పూన్ గోడు గ్రామస్థులకు ఫుట్​బాల్​ అంటే పిచ్చి. స్థానికంగా ఉన్న జట్ల మధ్య ఫైనల్​ మ్యాచ్​ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి 9గంటలకు జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.