Gali Janardhan Reddy Vs Sriramulu: గాలి జనార్దన్‌రెడ్డిని.. మైనింగ్ కింగ్ అని పిలుస్తుంటారు. తెలుగు మూలాలు కలిగిన ఈయన కర్ణాటకలోని బళ్లారి రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటారు. ఒకప్పుడు బళ్లారి ఏరియాలో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు అంటే బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు రాజకీయ శత్రువులు. ఇద్దరూ కర్ణాటక బీజేపీలోనే ఉన్నప్పటికీ.. విపక్ష నేతలను మించిన రేంజులో ఒకరిపైకి మరొకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. దీంతో కన్నడ నాట రాజకీయ వేడి రాచుకుంది.
Also Read :Hyderabad Kidney Racket : హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్.. 20 మందికి కిడ్నీల మార్పిడి.. 12 కోట్లు వసూలు
సండూరు ఎన్నికల ఫలితంపై విమర్శనాస్త్రాలు
గత వారం రోజులుగా బీజేపీ నేతలు గాలి జనార్దన్ రెడ్డి , శ్రీరాములు(Gali Janardhan Reddy Vs Sriramulu) బహిరంగ సవాళ్లను విసురుకుంటున్నారు. వీరి గొడవలు పార్టీకి నష్టం తెస్తాయని పలువురు అంటున్నారు. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన సండూరు స్థానంలో బీజేపీ ఓడిపోయింది. అక్కడ జనార్దన్‌రెడ్డి బలపరిచిన బంగారు హనుమంతప్ప ఓడిపోయాడు. ఒకవేళ హనుమంతప్ప గెలిపిస్తే సండూరులో తిరిగి జనార్దన్‌రెడ్డి హవా వీస్తుందని భావించిన మైనింగ్ వ్యాపారులంతా ఏకమై బీజేపీని ఓడించారని అంటున్నారు. అయితే ఈ ఓటమి వెనుక శ్రీరాములు ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి అనుమానిస్తున్నారు. ఈ అంశంపైనే ఇప్పుడు వారిద్దరు విమర్శించుకుంటున్నారు.
Also Read :Meerpet Murder Case : వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. హీటర్‌తో పొటాషియం హైడ్రాక్సైడ్‌లో ఉడికించి మరీ..
గతంలో వీరిద్దరూ ఎలా ఉండేవారంటే..
- 2004లో గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్ వ్యాపారంతో రూ. వందల, వేల కోట్లకు పడగలెత్తారు. ఆ టైంలో శ్రీరాములు, గాలి జనార్దన్‌రెడ్డి మంచి స్నేహితులు.
- 2011లో లోకాయుక్త గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసింది. దీంతో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు బీజేపీని వదిలి.. బీఎస్‌ఆర్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ నుంచే కంప్లి సురేష్, గాలి సోమశేఖర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
- దాదాపు 40 నెలల పాటు గాలి జనార్దన్‌రెడ్డి జైల్లో ఉన్నారు. ఆ సమయంలో జనార్దన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా శ్రీరాములు బళ్లారి నుంచి మైసూర్ వరకు పాదయాత్ర చేశారు.
- 2015 జనవరిలో గాలి జనార్దన్‌రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బళ్లారి, కర్నూ లు, అనంతపురం జిల్లాలకు వెళ్లరాదని షరతులు విధించింది. దీంతో 11 ఏళ్ల పాటు బళ్లారికి గాలి జనార్దన్ రెడ్డి దూరంగా ఉండిపోయారు.
- ఆ సమయంలో బళ్లారిలో శ్రీరాములు మాస్ లీడర్‌గా ఎదిగారు. 1999 నుంచి అనేక సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు.
- జైలుకు వెళ్లే ముందు గాలి జనార్దన్ రెడ్డి తన ఆస్తులను శ్రీరాములు, ఆయన అల్లుడు సురేష్ బాబు పేర్లతో ఉంచారు. జనార్దన్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక ఈ ఆస్తుల విషయమై వారి మధ్య గొడవ జరిగింది. బినామీ పేరుతో ఉంచిన తన ఆస్తులను తిరిగి ఇవ్వాలని జనార్దన్‌రెడ్డి అడిగితే సురేష్ బాబు ఇవ్వలేదని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
- ఈనేపథ్యంలో గత నాలుగేళ్లలో సీన్ మారింది. వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. 2024లో జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో శ్రీరాములు ఓడిపోయారు. కేఆర్‌పీపీ పేరుతో తాను పెట్టిన పార్టీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరిపోయారు.