Site icon HashtagU Telugu

Telangana: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవ్-కెసిఆర్

యాసంగిలో పంటల సాగు, ఉద్యోగ విభజన అంశాలపై నేడు ప్రగతిభావన్ లో కలెక్టర్​లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్​ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో మంత్రులు, సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

యాసంగిలో కేంద్రం వడ్లు కొనటం లేదు కాబట్టి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా రైతులను మళ్లించాలి. రైతుల్లో అవగాహన పెంచే బాధ్యత అధికారులు తీసుకోవాలి. వచ్చే వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని.. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టిపెట్టాలి అని ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారులను ఆదేశించారు.

కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలని.. ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది అని అన్నారు. స్థానికులకు నష్టం జరగకుండా.. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించి 5 రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కెసిఆర్ అధికారులతో అన్నారు.

Exit mobile version