Site icon HashtagU Telugu

Bihar Politics: బీహార్ రాజకీయ సంక్షోభం: పాట్నాకు నడ్డా

Bihar Politics

Bihar Politics

Bihar Politics: బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్ననితీశ్ కుమార్ తరుచూ రాజకీయ కూటములను మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం సుకీర్ణ భాగస్వాములైన అర్జేడీ, కాంగ్రెస్ పార్టీల బాగస్వామ్యంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కమర్ ఇప్పుడు తాజాగా ఎన్ డి ఎ కూటమిలో చేరబోతున్నారు. ఆర్జేడీ ముఖ్యనేలతో అసంతృప్తిగా ఉన్నారని నితీష్ విసిగిపోయారని తెలుస్తోంది..ఇండియా కూటమి రూపకల్పనలో కీలకపాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడిగా ఇటీవల కాంగ్రెస్ అధినేత ఖర్గేను ఎన్నుకోవడం కూడా ఆయన్ను మళ్లీ ఎన్టీయే వైపునకు వచ్చేలా చేశాయన్న వార్తలు వినపడుతున్నాయి.

ఇప్పటికే నితీశ్ కుమార్ జేడీయూ ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించుకున్నారు. రాజీనామా అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మార్గం సుగమం చేసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా నితీశ్ కుమార్ సీఎంగా ఉండేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నితీష్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. కొత్త మిత్రపక్షాల మద్దతుతో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా పిలిచిన జేడీయూ శాసనసభా పక్ష సమావేశంలో మహాకూటమి నుంచి తాను విడిపోవాల్సిన పరిస్థితులపై చర్చించనున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్నారు. నడ్డాతో పాటు చిరాగ్ పాశ్వాన్ కూడా హాజరవుతారు. చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాట్నాకు వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పాట్నా చేరుకోవాల్సి ఉంది. కాగా ఆదివారం బీజేపీ, జేడీయూ కోటాలో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అదే సమయంలో జితన్‌రామ్‌ మాంఝీ పార్టీ హమ్‌కు చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుంది. నితీష్ నేతృత్వంలో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వానికి బీజేపీకి చెందిన 78 మంది, జేడీయూకు చెందిన 45 మంది, హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు, ఒక స్వతంత్ర అభ్యర్ధి ఇలా మొత్తం 128 సభ్యుల మద్దతు లభిస్తుంది.

Also Read: INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ

Exit mobile version