Site icon HashtagU Telugu

Tamil Nadu: త‌మిళ‌నాడులో నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ ఎత్తివేత‌

tamil nadu lockdown

tamil nadu lockdown

తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధనలను ఫిబ్రవరి 15 వరకు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణ‌యం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సడలింపులను ఉంటాయ‌ని ఆయ‌న ప్రకటించారు.

ఫిబ్రవరి ఒక‌ట‌వ తేదీనుంచి 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.అయితే ప్లేస్కూల్స్, ఎల్‌కేజీ, యూకేజీలు పనిచేయవు. ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌లు మరియు శిక్షణా కేంద్రాలు ఫిబ్రవరి 1 నుండి (కోవిడ్ కేంద్రాలుగా పనిచేస్తున్నవి మినహా) పని చేయవచ్చు. అలాగే జనవరి 28 నుండి రాత్రి కర్ఫ్యూ ఉండ‌ద‌ని.. జనవరి 30 (ఆదివారం) పూర్తి లాక్డౌన్ కూడా ఉండ‌ద‌ని సీఎం స్టాలిన్ తెలిపారు.