Site icon HashtagU Telugu

Paneer Selvam : పన్నీర్ సెల్వానికి మద్దతుగా సీన్ లోకి ఆయన కుమారులు.. తమిళనాడులో మారిన పాలిటిక్స్

Panniru Selvam Jayalaliyha

Panniru Selvam Jayalaliyha

అన్నాడీఎంకేలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని దూరం పెట్టడంతో ఆయన కొత్త స్కె్చ వేశారు. పార్టీలో తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఆయన కుమారులు రవీంద్రనాథ్ కుమార్, జయప్రదీప్ లు దక్షిణ జిల్లాలో తమ బలమేంటో చూపించడానికి సిద్ధమయ్యారు. ఈనెల 23 నాటి సమావేశంలో పార్టీ తీసుకొచ్చిన తీర్మానాలను మాజీ మంత్రి షణ్ముగం నిరాకరించారు. మళ్లీ జూలై 11న సర్వసభ్య సమావేశం జరగనుంది. దానికి తమిళ్ మగన్ హుస్సేన్ ను ప్రిసీడియం ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆనాటి మీటింగ్ లో పార్టీ సుప్రీమ్ గా ఎన్నికవ్వడానికి ఎడప్పాడి పళనిస్వామి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పార్టీ నియమావళి ప్రకారం ఇద్దరు నాయకులు ఉండాల్సిందే అని పన్నీర్ సెల్వం అంటున్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యారు.

ఇటీవల పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత ఆయనకు ఢిల్లీ పెద్దలు భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఈలోపే పన్నీర్ సెల్వం ను పార్టీ నుంచి పూర్తిగా తప్పించడానికి ఈపీఎస్ వర్గం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. అందుకే మాజీ మంత్రులంతా ఓపీఎస్ పై విరుచుకుపడుతున్నారు. అందుకే ఇప్పుడు పన్నీర్ సెల్వం కుమారులు ఏకంగా రంగంలోకి దిగారు. పన్నీర్ సెల్వం ఢిల్లీ ఎపిసోడ్ ను నడిపించింది కూడా ఆయన కుమారుడు రవీంద్రనాథ్ అని తెలిసింది. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఓపీఎస్, ఆయన కుమారుడు ఉన్నారు.

చెన్నైలో ఎడప్పాడి పళనిస్వామి నివాసముంటున్న ప్రాంతంలో పన్నీర్ సెల్వానికి మద్దతు పలికేలా వాల్ పోస్టర్లు అంటించారు.. ఓపీఎస్ వారసులు. దీని వెనక ఎలక్షన్ స్ట్రాటజిస్టు ఉన్నట్టుగా తెలుస్తోంది.