Site icon HashtagU Telugu

Everest: ఎవరెస్టంత విషాదం.. కూర్చున్న చోటే తుదిశ్వాస!

Everest

Everest

ఎవరెస్ట్ ను అధిరోహించాలని కొన్ని కోట్లమంది కల కంటారు. దానికోసం రేయింబవళ్లూ కష్టపడతారు. ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ చాలామందికి ఆ కల నెరవేరదు. మరికొంతమంది మధ్యలోనే వెనుదిరగాల్సి వస్తుంది. కాని అదే పర్వతాన్ని ఎక్కుతూ మధ్యలో ఓ చోట కూర్చున్న నేపాలీ పర్వతారోహకుడు.. అలా కూర్చున్న స్థితిలోనే కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఎవరెస్ట్ గురించి కాస్త స్టడీ చేసినవారికి ఆ పర్వతంపై ఉండే ఫుట్ బాల్ ఫీల్డ్ గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పర్వతంపై కాస్త విశాలంగా ఉండే ప్రాంతమిదే. ఇంకా చెప్పాలంటే మొత్తం పర్వతం మీద రక్షణను అందించే ప్రాంతం కూడా ఇదే.

అలాంటి చోట 38 ఏళ్ల ఎంజిమి టెన్జీ అనే షెర్పా కూర్చున్న స్థితిలో చనిపోయి కనిపించాడు. నిజానికి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని మిగిలిన పర్వతారోహకులు అనుకున్నారు. ఎందుకంటే అతడి వీపునకు బ్యాక్ ప్యాక్ కూడా అలాగే ఉంది. కానీ ఎంతకూ కదలకపోయేసరికీ కదిపి చూడడంతో అప్పటికే అతృ మృతి చెందినట్లు అర్థం చేసుకున్నారు. ఎవరెస్ట్ పై వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంది. అలాంటి కష్టసాధ్యమైన పరిస్థితుల్లోనే పర్వతాన్ని అధిరోహించడానికి చాలామంది సిద్ధపడతారు.

ఇప్పుడు ఎంజిమి టెన్జీ కూడా ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. కానీ ఎత్తయిన ప్రదేశానికి చేరినప్పుడు అతడు అనారోగ్యానికి గురికావడం వల్లే ప్రాణాలు కోల్పోయాడు. ఎవరెస్ట్ పై క్యాంప్-2కు సామాన్లు తీసుకెళ్లే సమయంలో అస్వస్థతకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. షెర్పాల జీవితం చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. పర్వతాలను అధిరోహించేవారు.. షెర్పాల సాయం తీసుకుంటారు. షెర్పాలు కూడా పర్వతారోహణలో ఆరితేరి ఉంటారు. ఎవరెస్ట్ పై వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో వారికి అంచనా ఉంటుంది. ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో కూడా అవగాహన ఉంటుంది. అయినా సరే.. ఊహించని విధంగా వాతావరణం మారితే.. ఇలాంటి ప్రమాదాలు
తప్పవు.